Puneeth Rajkumar : పునీత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టిన పునీత్ భార్య
పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తన మొదటి పోస్టును ఎంతో ఎమోషనల్ గా పెట్టారు. ఆమె ఆ పోస్టులో 'శ్రీ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం మా కుటుంబ

Puneeth Wife
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత నెల 29న మరణించారు. ఆయన మరణ వార్తను అభిమానులు, కన్నడ ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన సినిమాలకంటే కూడా ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. నేటికీ వేలాది మంది అభిమానులు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు వస్తున్నారు. ఇక పునీత్ మరణం తర్వాత అయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లు. వారిని ఓదార్చడం ఎవ్వరి వల్ల కావట్లేదు. పునీత్ మరణం తర్వాత కార్యక్రమాలన్నీ ఆయన అన్న శివ రాజ్ కుమార్ దగ్గరుండి చూసుకున్నారు.
Jai Bheem : ‘జై భీమ్’ సినిమాపై సీతక్క ట్వీట్.. రిప్లై ఇచ్చిన సూర్య
పునీత్ అంతక్రియల తర్వాత పునీత్ భార్య అశ్విని, ఆమె కూతుళ్లు ఇప్పటి వరకు బయటకి రాలేదు. పునీత్ వైఫ్ అశ్విని సోషల్ మీడియాలో లేదు. తాజాగా పునీత్ పై దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు చూపిస్తున్న ప్రేమను చూసి వారందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి మొదటి సారి సోషల్ మీడియాలో అడుగు పెట్టారు. నిన్న పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తన మొదటి పోస్టును ఎంతో ఎమోషనల్ గా పెట్టారు.
Bigg Boss 5 : కెప్టెన్సీ టాస్కుతో మరోసారి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్
ఆమె ఆ పోస్టులో ‘శ్రీ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం మా కుటుంబ సభ్యులకే కాదు, మొత్తం కర్ణాటక ప్రజలకు షాకింగ్‌గా ఉంది. ఆయన్ను ‘పవర్ స్టార్’ చేసిన అభిమానులకు పునీత్ లేని లోటు ఊహించడం కష్టమే. ఈ బాధలో మీరు మనోనిబ‍్బరం కోల్పోకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా, గౌరవంగా పునీత్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. సినీ ప్రియులు మాత్రమే కాకుండా ఇండియాతో పాటు విదేశాల నుంచి కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు. అప్పుని వేలాది మంది ఫాలో అవ్వడం, ఆయనలా నేత్రదానానికి ముందుకు రావడం, మీ మనసులో అప్పుకు ఉన్న స్థానం చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన‍్ను ఆదర్శంగా తీసుకొని మీరు చేసే మంచి పనుల్లో పునీత్ జీవించే ఉంటారు. మీరు చూపిస్తున్న ప్రేమకు, మద్దతుకు మా మొత్తం కుటుంబం తరఫున అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.’ అంటూ అశ్విని తెలిపారు.
Burra Sai Madhav : ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్‌కు డాక్టరేట్
కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మొదటిసారి ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసిన పునీత్ వైఫ్ ను ఒక్క రోజులోనే 48 వేల మందికి పైగా ఫాలో అయ్యారు.