Pushpa Producers : థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతిపై స్పందించిన పుష్ప నిర్మాతలు.. ఏమన్నారంటే..

తాజగా ఈ ఘటనపై నిర్మాతలు స్పందించారు.

Pushpa Producers : థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతిపై స్పందించిన పుష్ప నిర్మాతలు.. ఏమన్నారంటే..

Pushpa Producer Mythri Movie Makers Reacts on Tragic Incident which Happens Yesterday Night Pushpa Premiere Show

Updated On : December 5, 2024 / 3:32 PM IST

Pushpa Producers : హైదరాబాద్ సంధ్య థియేటర్లో నిన్న రాత్రి వేసిన నిన్న పుష్ప ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ కూడా రావడంతో భారీగా అభిమానులు వచ్చారు. దీంతో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఫ్యామిలీతో ఓ వ్యక్తి సినిమాకు రాగా తొక్కిసలాటలో అతని భార్య రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ స్పృహతప్పి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read : Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ టీం.. కీలక ప్రకటన

తాజగా ఈ ఘటనపై నిర్మాతలు స్పందించారు. సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియాలో ఈ ఘటనపై స్పందిస్తూ.. నిన్న రాత్రి జరిగిన సంఘటన మాకు చాల బాధాకరం. ఆ ఫ్యామిలీకి, చికిత్స తీసుకుంటున్న ఆ అబ్బాయి కోసం మేము ప్రార్ధనలు చేస్తాం. అలాగే ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి మేము అండగా నిలబడతాము అని పోస్ట్ చేసారు.