Ravindra Jadeja : రవీంద్ర జడేజాకు టెస్టు కెప్టెన్ అవ్వాలని ఉందా..? మీడియాకు సూటిగా సమాధానం ఇచ్చిన జడ్డూ.. ఇలా ఎన్నిసార్లు బ్రో..!

రాబోయే టెస్టు మ్యాచ్‌లకు రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా బీసీసీఐ నియమించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది.

Ravindra Jadeja : రవీంద్ర జడేజాకు టెస్టు కెప్టెన్ అవ్వాలని ఉందా..? మీడియాకు సూటిగా సమాధానం ఇచ్చిన జడ్డూ.. ఇలా ఎన్నిసార్లు బ్రో..!

Ravindra Jadeja

Updated On : October 12, 2025 / 9:17 AM IST

Ravindra Jadeja : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరుగుతోంది. శనివారం రెండోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి 518 పరుగుల వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. అయితే, శనివారం మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా మీడియా సమావేశంలో ఈ సందర్భంగా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అంశంపై ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ కొనసాగుతున్నారు. అతనికి డిప్యూటీగా రవీంద్ర జడేజాను బీసీసీఐ నియమించింది. దీంతో రాబోయే టెస్టు మ్యాచ్‌లకు రవీంద్ర జడేజాను పూర్తిస్థాయి కెప్టెన్‌గా బీసీసీఐ నియమించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. కానీ, సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు రిటైర్మెంట్ దశలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారా.. అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు రవీంద్ర జడేజా ముందు ప్రస్తావించారు. టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా..? అంటూ మీడియా ప్రశ్నించగా.. జడేజా సూటిగా సమాధానం ఇచ్చారు.

Also Read: NAM vs SA: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. ఏంటి బ్రో ఇలా ఆడారు.. దిమ్మతిరిగే షాకిచ్చారుగా.. చివరి ఓవర్లో మాత్రం మెంటలెక్కించారు.. వీడియో వైరల్

‘నేను గతంలోనూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాను. మళ్లీ అదే ప్రశ్నను ఎన్నిసార్లు అడుగుతారు. మీరు ఎన్నిసార్లు ఈ ప్రశ్న అడిగినా నా సమాధానం మారదు. కెప్టెన్ కావాలనే ఆలోచన నాకు లేదు. గతంలో కెప్టెన్ అవ్వాలనే ఆలోచన ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం అలాంటి ఆలోచన ఏమీలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా మరింతకాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించడంపైనే ఉంది. నేను ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ బ్యాటింగ్, బౌలింగ్ లో జట్టుకు ప్రయోజనం చేకూరేలా ఆడాలని అనుకుంటున్నా. అంతేకానీ, కెప్టెన్నీ, వైస్ కెప్టెన్సీ బాధ్యతల గురించి నేనే ఆలోచించడం లేదు.’ అంటూ జడేజా సమాధానం ఇచ్చారు.


ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కు టీమిండియా జట్టులో తన పేర లేకపోవడంపైనా జడేజా స్పందిస్తూ.. “నేను వన్డేలు ఆడాలనుకుంటున్నాను. కానీ, అది నా చేతుల్లో లేదు. రోజు చివరిలో జట్టు నిర్వహన, కెప్టెన్, కోచ్ ఒక నిర్దిష్ట మార్గంలో ఆలోచిస్తారు. ఆస్ట్రేలియాతో జట్టు ఎంపిక ముందు టీం మేనేజ్మెంట్ నాతో మాట్లాడారు.. జట్టులో నా పేరు లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. జట్టును ప్రకటించిన తర్వాత మాత్రమే నాకు అది తెలియలేదు. కెప్టెన్, సెలెక్టర్లు, కోచ్ వారి ఆలోచన గురించి నాకు ముందుగానే తెలియజేశారని అన్నారు.

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియా ప్రకటించిన జట్టులో రవీంద్ర జడేజా పేరు లేదు. గతేడాది టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పటికీ టెస్ట్, వన్డే ఫార్మాట్లలో మాత్రం జడేజా కొనసాగుతున్నాడు. చివరగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున వన్డేలు ఆడాడు.