Pushpa : యూట్యూబ్ టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ లో ‘పుష్ప’ ఆల్ సాంగ్స్

ఈ సినిమాలోని 5 పాటలు ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ జాబితాలో ఉన్నాయి. మొదటి స్థానంలో 'ఊ అంటావా.. ఊఊ అంటావా' సాంగ్, రెండో స్థానంలో 'సామి సామి' సాంగ్, 24వ స్థానంలో.....

Pushpa : యూట్యూబ్ టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ లో ‘పుష్ప’ ఆల్ సాంగ్స్

Pushpa

Updated On : January 4, 2022 / 10:01 AM IST

Pushpa :   ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. డిసెంబర్ 17వ తేదిన విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించి కలెక్షన్స్ కూడా సాధించింది. అంతే కాక కొత్త కొత్త రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ ఎంత వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే.

Mohan Babu : నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత సి.కళ్యాణ్

ఇందులో ఉన్న అయిదు పాటలు బాగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి. ఈ పాటలు ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే ఈ సినిమాలోని 5 పాటలు ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ జాబితాలో ఉన్నాయి. మొదటి స్థానంలో ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ సాంగ్, రెండో స్థానంలో ‘సామి సామి’ సాంగ్, 24వ స్థానంలో ‘శ్రీవల్లి’ సాంగ్, 74వ స్థానంలో ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్, 97వ స్థానంలో ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్ ఉన్నాయి. ఇలా సినిమాలో ఉన్న ఐదు పాటలు టాప్ 100లో ఉండడంతో మరో రికార్డ్ సాధించింది ఈ సినిమా.