Allu Arjun : అల్లు అర్జున్‌ ‘మైనపు విగ్రహం’ మేకింగ్ వీడియో చూశారా..?

మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయాన్ని తెలియజేస్తూ ఒక మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.

Allu Arjun : అల్లు అర్జున్‌ ‘మైనపు విగ్రహం’ మేకింగ్ వీడియో చూశారా..?

Pushpa star Allu Arjun wax statue at Madame Tussauds museum

Updated On : October 6, 2023 / 10:04 AM IST

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసే గౌరవాన్ని దక్కించుకున్నాడు అని న్యూస్ వచ్చిన సంగతి. అయితే దీనిపై బన్నీ సన్నిహితులు గాని, మేడమ్‌ టుస్సాడ్స్‌ వారు గాని ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తూ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం వారు ఒక వీడియో పోస్టు చేశారు. అల్లు అర్జున్ విగ్రహం ఏర్పాటు కోసం కొలతలు తీసుకోవడాన్ని చూపిస్తూ ఒక మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.

అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కాకుండా దుబాయ్ మ్యూజియంలో పెట్టబోతున్నారు. ఈ మ్యూజియంలో ప్రదర్శితం కానున్న తొలి తెలుగు మైనపు బొమ్మ బన్నీదే కావడం విశేషం. ఇక అక్కడ ఉండబోయే విగ్రహం ఎలా ఉందబోతుందంటే.. అల వైకుంఠపురములో చిత్రంలో రెడ్‌ జాకెట్‌తో ఉన్న అల్లు అర్జున్‌ విగ్రహం అక్కడ ప్రదర్శితం కానుంది. త్వరలోనే ఈ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయనున్నారు. కాగా మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఇప్పటికే మన తెలుగు హీరోలు ప్రభాస్‌, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు.

Also read : Bigg Boss 7 : ఎమోషనల్ అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్స్.. మరో ప్రేమ కహాని షురూ..

ఇప్పుడు అల్లు అర్జున్ ఈ గౌరవం అందుకున్నాడు. కాగా బన్నీ ఇటీవలే త్తమ నటుడిగా జాతీయ అవార్డుని కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఈ పురస్కారం అందుకున్న మొట్టమొదటి టాలీవుడ్ యాక్టర్ గా అల్లు అర్జున్ సంచలనం సృష్టించాడు. పుష్ప 1 సినిమాలోని నటనకు గాను ఈ అవార్డు వచ్చింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతూ వస్తుంది. మరి ఆ మూవీతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగష్టు 15న విడుదల అయ్యేందుకు సిద్దమవుతుంది.