Pushpaka Vimanam : ‘ఆహా’ లో ‘పుష్పక విమానం’..

తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.. ఇప్పుడు మరో సాలిడ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించనుంది..

Pushpaka Vimanam : ‘ఆహా’ లో ‘పుష్పక విమానం’..

Pushpaka Vimanam

Updated On : December 1, 2021 / 2:03 PM IST

Pushpaka Vimanam: బ్లాక్‌బస్టర్ సినిమాలు, ట్రెండీ వెబ్ సిరీస్, సెలబ్రిటీ టాక్ షోస్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో ‘అన్‌స్టాపబుల్’ షో ప్లాన్ చేసి మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారడమే కాకుండా.. 2.ఓ అంటూ అప్‌డేటెడ్ వెర్షన్‌తో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతూ డిజిటల్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.. ఇప్పుడు మరో సాలిడ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించనుంది.

Sirivennela : సిరివెన్నెలకి గూగుల్ నివాళి..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూడో సినిమా ‘పుష్పక విమానం’. దామోదరను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. విజయ్ దేవరకొండ సమర్పణలో.. ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద విజయ్ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించారు.
నవంబర్ 12న థియేటర్లలోకి వచ్చిన ‘పుష్పక విమానం’ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సరిగ్గా నాలుగు వారాల తర్వాత ‘ఆహా’ లో ప్రీమియర్ కాబోతోంది.

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం అన్నయ్య మృతి..

ఇటీవల ‘సర్కార్’, ‘చెఫ్ మంత్ర’ వంటి క్రేజీ షోలు, ‘3 రోజెస్’ వంటి ట్రెండీ సిరీస్‌తో పాటు.. ‘లవ్ స్టోరీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి సూపర్ డూపర్ సినిమాలతో తమ ఆడియన్స్‌కి మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ దూసుకుపోతోంది ‘ఆహా’.