Radhe Shyam: రాధేశ్యామ్ ఫస్ట్ బొమ్మ పడేది ఇక్కడే!

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రాధేశ్యామ్ మరికొద్ది గంటల్లో యావత్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Radhe Shyam: రాధేశ్యామ్ ఫస్ట్ బొమ్మ పడేది ఇక్కడే!

Radhe Shyam First Show

Updated On : March 10, 2022 / 3:23 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రాధేశ్యామ్ మరికొద్ది గంటల్లో యావత్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చాలా మంది ఆతృతగా చూస్తున్నారు. కానీ అందరికంటే ముందుగా రాధేశ్యామ్ సినిమాను హైదరాబాదీలు చూసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమా తొలి ఆటను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో అందరికంటే ముందుగా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం నాడు వేకువజాము కంటే ముందుగానే ఈ థియేటర్లో రాధేశ్యామ్ బొమ్మ పడే అవకాశం ఉందట. దీంతో మన దగ్గరే రాధేశ్యామ్ బొమ్మ తొలుత పడుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వారు ఈ సినిమాను అందరికంటే ముందుగా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. టికెట్ల కోసం వారు తీవ్రంగా ప్రయత్నిస్తూ, తమ అభిమాన హీరోపై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. ఇక ఈ షోకు సంబంధించిన టికెట్ల కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ట్రై చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు రాధేశ్యామ్ చిత్రంపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగడంతో, ఈ సినిమా వసూళ్ల పరంగా ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందా అని అందరి చూపుులు ఈ సినిమావైపే ఉన్నాయి. ప్రభాస్ వింటేజ్ లుక్‌తో ఈ సినిమాలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు చిత్ర టీమ్ ముందునుండీ చెబుతూ వస్తోంది. ఇక ఈ సినిమాలోని అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వనుండగా, ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే తన నటనతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

పాన్ ఇండియా మూవీగా వస్తున్న రాధేశ్యామ్ చిత్రానికి సౌత్‌లో జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించగా, థమన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. అటు బాలీవుడ్ వర్షన్‌కు మిథూన్, మనన్ భరద్వాజ్‌లు సంయుక్తంగా మ్యూజిక్ అందిస్తున్నారు. మరి రాధేశ్యామ్ బొమ్మ మనదగ్గరే ముందుగా పడుతుండటంతో హైదరాబాద్ వాసులు ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తారా అనేది ఇప్పుడు అందరిలోనూ క్యూరియాసిటీని పెంచింది. అటు ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Read More:

Radhe Shyam: రెబల్ స్టార్ రేంజ్.. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డ్!

Radhe Shyam: రా.. రా.. రాధేశ్యామ్.. ఇక కొన్ని గంటలే మిగిలింది!