Radhe Shyam: స్పీడ్ పెరిగిన ప్రమోషన్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

ఎట్టకేలకు స్పీడ్ చూపిస్తున్నారు రాధేశ్యామ్ మేకర్స్. 11కి ఇంకా 10రోజులు కూడా లేవు కాబట్టి.. ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసే పనిలో బిజీగా మారారు. ఆడియెన్స్ మందుకు కొత్త రిలీజ్ ట్రైలర్..

Radhe Shyam: స్పీడ్ పెరిగిన ప్రమోషన్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

Radhe Shyam 11zon

Updated On : March 3, 2022 / 6:14 PM IST

Radhe Shyam: ఎట్టకేలకు స్పీడ్ చూపిస్తున్నారు రాధేశ్యామ్ మేకర్స్. 11కి ఇంకా 10రోజులు కూడా లేవు కాబట్టి.. ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసే పనిలో బిజీగా మారారు. ఆడియెన్స్ మందుకు కొత్త రిలీజ్ ట్రైలర్ తీసుకొచ్చారు. డైరెక్ట్ గా రంగంలోకి దూకి ముంబై నుంచి ప్రమోషన్స్ షురూ చేసిన ప్రభాస్.. మార్చ్ 10 వరకు బ్రేక్ లేకుండా రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Radhe Shyam: సినిమాలో స్పెషల్ అట్రాక్షన్స్.. నెవెర్ బిఫోర్ ప్రమోషన్స్!

ప్రేమకి, విధికి మధ్య జరిగే యుద్ధమే రాధేశ్యామ్ అని తేల్చేసారు రాజమౌళి. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ గ్రాండ్ విజువల్స్ తో రీసెంట్ గా రిలీజ్ చేసిన రాధేశ్యామ్ ట్రైలర్ లో చివరిగా వినిపించిన గొంతు జక్కన్నదే. పామిస్ట్ గా ప్రభాస్ క్యారెక్టర్ ను పూర్తిగా రివీల్ చేసి.. ఫ్యాన్స్ కు ఈ సూపర్ గ్లింప్స్ తో కిక్కిచ్చాడు డైరెక్టర్ రాధాకృష్ణ. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ కొత్త టీజర్ లెవెల్ ను పీక్స్ కు తీసుకెళ్లింది.

Radhe Shyam: ట్రైలర్‌తో కౌంట్‌డౌన్ స్టార్.. వారం రోజుల పాటు ప్రమోషన్ ఈవెంట్స్!

ముంబైలో రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ సందడి చేశారు. పూజా హెగ్డేతో కలిసి గ్లోబల్ స్టార్ రాధేశ్యామ్ పై హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. తమిళ్ ఆడియెన్స్ కోసం మార్చ్ 4న.. తెలుగువారి కోసం 6,7 తేదీలు.. మల్లూ ఫ్యాన్స్ కోసం మార్చ్ 8.. ఢిల్లీలో మార్చ్ 9 ఇలా మార్చ్ 10 వరకు రాధేశ్యామ్ ప్రమోషన్స్ కోసం స్లాట్స్ ఫిక్స్ చేసుకున్నారు డార్లింగ్. సినిమా స్టఫ్ ఏదన్నా అన్న ఫ్యాన్స్ కోసం ఇలా రిలీజ్ కు ముందు ఫుల్ టైమ్ స్పెండ్ చేస్తుంది రాధేశ్యామ్ యూనిట్.

Radhe Shyam Release Trailer: ప్రేమకి విధికి మధ్య జరిగిన యుద్ధమే రాధేశ్యామ్!

రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో పెళ్లి గురించి ఇలా ఫన్నీగా స్పందించిన ప్రభాస్.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో టాలీవుడ్ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలు దుమ్మురేపుతాయన్నారు. అలాగే రాజమౌళితో మళ్లీ కలిసి వర్క్ చేసే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు ప్రభాస్. జక్కన్నతో ఒక ప్లాన్ ఉందని.. ఎప్పుడు వర్కవుట్ అవుతుందో చూడాలంటూ చెప్పుకొచ్చారు.