Radhe Shyam : రికార్డు సృష్టించిన ‘రాధేశ్యామ్’ ట్రైలర్.. 24 గంటల్లో..
ట్రైలర్ యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన టాలీవుడ్, సౌత్ ఇండియా సినిమా ట్రైలర్‌గా రాధేశ్యామ్ ట్రైలర్ ఘనత సాధించింది.

Radhe Shyam
Radhe Shyam : రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్’ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. 40 వేలమంది ప్రభాస్ అభిమానులు ఈ ఈవెంట్ తరలివచ్చారు. అదే రోజు అభిమానుల చేతులమీదుగా రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టించింది.
చదవండి : Radhe Shyam: తెగ నచ్చేసిన ట్రైలర్.. సినిమా ఎలా ఉంటుందో లెక్కలేసుకుంటున్న ఫ్యాన్స్!
24 గంటల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన టాలీవుడ్, సౌత్ ఇండియా సినిమా ట్రైలర్‌గా రాధేశ్యామ్ ట్రైలర్ ఘనత సాధించింది. 24 గంటల్లో తెలుగులో రాధేశ్యామ్ ట్రైలర్‌కు 23.2 మిలియన్ల వ్యూస్ రాగా రెండో స్థానంలో ఉన్న బాహుబలి-ది కంక్లూజన్ ట్రైలర్‌కు 21.81 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మొదటి రెండు స్థానాల్లో ప్రభాస్ చిత్రాలే ఉండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
చదవండి : Radheshyam Trailer : రాధేశ్యామ్ ట్రైలర్‌లో ఇది గమనించారా?
ఇక అన్ని భాషల్లో చూసుకుంటే.. 24గంటల్లో 57.52 మిలియన్ల వ్యూస్, 1.43 మిలియన్ల లైక్స్ వచ్చాయి. రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు తెలుగు టాప్ హీరోలు నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కంటే అధిక వ్యూస్ సాధించింది ఈ చిత్ర ట్రైలర్. ఆర్ఆర్ఆర్ 24 గంటల్లో 51.12 మిలియన్ల వ్యూస్ వస్తే.. రాధే శ్యామ్‌కు 57.52 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.