Radhakrishna : రాధేశ్యామ్ ట్రోల్స్ పై స్పందించిన డైరెక్టర్
కొంతమంది మాత్రం 'రాధేశ్యామ్'పై నెగిటివ్ టాక్ ని ప్రచారం చేస్తున్నారు. ప్రభాస్ అంటే మాస్ ఎలివేషన్స్ ఉండాలని గత బాహుబలి, సాహో లాగా ఆశిస్తున్నారు. ప్రేమకథ సినిమా అని అర్ధం చేసుకొని...

Radhakrishna
Radheshyam : ప్రభాస్, పూజహెగ్దే జంటగా ఇటీవల మార్చ్ 11న ‘రాధేశ్యామ్’ సినిమా రిలీజ్ అయింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్లని రాబడుతుంది. అయితే కొంతమంది మాత్రం ‘రాధేశ్యామ్’పై నెగిటివ్ టాక్ ని ప్రచారం చేస్తున్నారు. ప్రభాస్ అంటే మాస్ ఎలివేషన్స్ ఉండాలని గత బాహుబలి, సాహో లాగా ఆశిస్తున్నారు.
ఇది ప్రేమకథ సినిమా అని అర్ధం చేసుకొని చూసిన వారికి ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. కానీ కొంత మంది మాత్రం ఈ సినిమా చూసి నిరాశ వ్యక్తపరిచారు. రాధేశ్యామ్‌లో ఒక్క యాక్షన్ ఎలిమెంట్ కూడా లేకపోవడం, పాన్ ఇండియా సినిమా, ప్రభాస్ సినిమా అయ్యుండి ఒక్క ఫైట్ సీన్, కామెడీ సీన్స్ కూడా లేకపోవడం మాస్ ఆడియన్స్ ని నిరాశపరిచాయి. దీంతో కొంతమంది సోషల్ మీడియాలలో ‘రాధేశ్యామ్’పై నెగిటివ్ ప్రచారం, ట్రోల్స్ చేస్తున్నారు.
Pawan Kalyan : జనసేన పార్టీ ఆవిర్భావ వేడుక
ఇప్పటికే ఈ ట్రోల్స్ పై తమన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తాజాగా ‘రాధేశ్యామ్’పై వస్తున్న ట్రోల్స్, నెగిటివ్ టాక్స్ పై సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ స్పందించారు. ఇటీవల నిర్వహించిన సక్సెస్ మీట్ లో ఈ ట్రోల్స్ పై మాట్లాడారు. రాధాకృష్ణ మాట్లాడుతూ.. ”వెజిటేరియన్ హోటల్‌కు వెళ్లి చికెన్ బిర్యానీ పెడతారని ఎలా ఆశిస్తారు? రాధేశ్యామ్ సినిమా ఇంటెన్సివ్ లవ్‌స్టోరీ అని ముందు నుంచే చెబుతున్నాము, ఓ ప్రేమకథ నుంచి ఇంకేం ఆశిస్తారు? ఇది కమర్షియల్ అంశాలు ఉన్న సినిమా కాదు, పూర్తి లవ్ స్టోరీ మాత్రమే అని చెప్పాము. ప్రేమకథ సినిమాని అలా చూసిన వారికే నచ్చుతుంది” అంటూ తెలిపారు.
Allu Arjun : సంజయ్‌లీలా భన్సాలీతో అల్లు అర్జున్ సమావేశం.. సినిమా కోసమేనా??
కొంతమంది ‘రాధేశ్యామ్’పై నెగిటివ్ ప్రచారం చేసినా ఈ సినిమా చాలా మందికి నచ్చింది. మొదటి మూడు రోజుల్లోనే 151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి, యూత్ కి, ఫీల్ గుడ్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా బాగా నచ్చింది. మరో 10 రోజుల వరకు ఎలాంటి పెద్ద సినిమా లేకపోవడంతో కలెక్షన్స్ మరింత వచ్చే అవకాశం ఉంది.