ఉత్సాహం ఉంటే వయసుతో పనేముంది!

తనకీ,ముగ్ధా గాడ్సే‌కి మధ్య గల వయసు తేడా గురించి స్పందించిన రాహుల్ దేవ్..

  • Published By: sekhar ,Published On : March 9, 2020 / 04:01 PM IST
ఉత్సాహం ఉంటే వయసుతో పనేముంది!

Updated On : March 9, 2020 / 4:01 PM IST

తనకీ,ముగ్ధా గాడ్సే‌కి మధ్య గల వయసు తేడా గురించి స్పందించిన రాహుల్ దేవ్..

33 ఏళ్ల నటితో డేటింగ్ చేస్తున్న 51 ఏళ్ల నటుడు.. ఆమెకు 33, అతనికేమో 51.. ఇలా రకరకాల హెడ్డింగులతో రాహుల్ దేవ్, ముగ్దా గాడ్సేల రిలేషన్ గురించి పలు వార్తలు వచ్చాయి. తెలుగుతో పాటు  దక్షిణాది భాషల్లో ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పించిన రాహుల్ దేవ్ వయసులో తనకంటే 18 ఏళ్లు చిన్నది అయిన మోడల్, నటి ముగ్ధా గాడ్సేతో కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నాడు.

వీరిద్దరి మధ్య వయసు తేడా మంచి కథా వస్తువుగా దొరకడంతో రకరకాలుగ వార్తలు రాస్తున్నారు. తాజాగా రాహుల్ తమ రిలేషన్ అండ్ ఏజ్ గ్యాప్ గురించి స్పందించాడు. ‘మా అమ్మ, నాన్న కంటే పదేళ్లు చిన్నది.. అయినా వాళ్లిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ముగ్ధా తన కంటే 18ఏళ్లు చిన్నది.. అయినా బంధం గట్టిగా మనం సంతోషంగా ఉంటే వయస్సు అనేది పెద్ద సమస్య కాదు’ అని రాహుల్‌ తన అభిప్రాయం తెలియచేశాడు. 

కాగా రాహుల్  1998 లో తన చిన్ననాటి స్నేహితురాలైన  రైనాను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి సిద్ధార్ధ్ అనే కొడుకు ఉన్నాడు.   రైనా 2009లో క్యాన్సర్‌తో చనిపోయింది. ఆ తర్వాత కుమారుడు మీద దృష్టి పెట్టిన రాహుల్‌కు ఒక స్నేహితుడి పెళ్లిలో ముగ్ధ పరిచయం అయ్యింది.