ఎన్టీఆర్‌కి ఫ్రెండ్ రోల్‌లో రాహుల్ రామకృష్ణ

తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం ప్రతిఒక్కరు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చినా కూడా సినిమాల్లో విభిన్నమైన పాత్రలతోఆకట్టుకుంటున్నాడు రాహుల్ రామకృష్ణ. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో ఆయనకు అవకాశం లభించింది. అందులోనే ఎన్టీఆర్‌కి ఫ్రెండ్‌గా ఎంతో ప్రతిష్టాత్మకమైన రోల్‌లో నటిస్తున్నాడు. త్వరలో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. రాహుల్ రామకృష్ణ పాత్ర ఇందులో కాస్త ఎమోషనల్‌గా ఉండనుందట. ఎన్టీఆర్ ఇందులో కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి చేస్తున్న సినిమా కావడం.. పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటిసారి నటిస్తుండటంతో ఈ మల్టీస్టారర్పై భారీ అంచనాలు ఉన్నాయి.