Rahul Ravindran: అందాల రాక్షసి హీరోనా.. ఇలా అయిపోయారేంటి.. పదిసార్లు సారీ చెప్పిన ప్రభాస్
అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ "చిలసౌ" సినిమాతో దర్శకుడిగా మారాడు(Rahul Ravindran). ఆయన నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ "ది గర్ల్ ఫ్రెండ్".
Rahul Ravindran made interesting comments about Prabhas
Rahul Ravindran: అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ “చిలసౌ” సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆయన నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. నేషనల్ క్రష్ రష్మీక మందన్నా హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా.. అను ఇమ్మాన్యుయేల్ కీ రోల్ లో కనిపించనుంది. ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Bheems: చనిపోదాం అని సెల్ఫీ వీడియో.. నా ఫ్యామిలీకి కూడా తెలియదు.. అదే సమయంలో ఒక కాల్..
ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. “నేను ప్రభాస్ హీరోగా వస్తున్న “ఫౌజీ” సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను. అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి ఈ సినిమాను చేస్తున్నాడు. ఒక రోజు నాకు ప్రభాస్ మధ్య సీన్ చేశాం. కట్ చెప్పాక ప్రభాస్ గారు డైరెక్టర్ హను దగ్గరకు వెళ్లి ఆయన్ని ఎక్కడో చూశాను కానీ నాకు గుర్తు రావడం లేదు అన్నాడట. దాంతో హను నన్ను ప్రభాస్ దగ్గరకు తీసుకెళ్ళి ఇతను నా ఫస్ట్ సినిమా అందాల రాక్షసి సినిమాలో హీరో అని చెప్పాడు. దానికి ప్రభాస్.. అవును రాహుల్ రవీంద్రన్ కదా. మీరేంటండి యంగ్ గా, లవర్ బాయ్ లా ఉంటారు కదా.. ఇలా అయిపోయారేంటి అన్నారు. దానికి నేను మీ మూవీలో గెటప్ సార్ ఇది అన్నాను. దానికి ప్రభాస్ గారు.. సారీ అండి నేను గుర్తుపట్టలేదు. ఎం అనుకోకండి అన్నారు.
అలా ఆరోజు మొత్తం ఒక పదిసార్లు ఆయన నాకు సారీ చెప్తూనే ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. దీంతో రాహుల్ రవీంద్రన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఫౌజీ సినిమా విషయానికి వస్తే, ఆర్మీ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
