Bheems: చనిపోదాం అని సెల్ఫీ వీడియో.. నా ఫ్యామిలీకి కూడా తెలియదు.. అదే సమయంలో ఒక కాల్..

భీమ్స్‌ సిసిరోలియో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న(Bheems) పేరు. తన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ తో సినిమాలను నెక్స్ట్ లెవల్లో నిలబెడుతున్నాడు భీమ్స్.

Bheems: చనిపోదాం అని సెల్ఫీ వీడియో.. నా ఫ్యామిలీకి కూడా తెలియదు.. అదే సమయంలో ఒక కాల్..

Bheems emotional comments about hero ravi teja

Updated On : October 29, 2025 / 9:14 AM IST

Bheems: భీమ్స్‌ సిసిరోలియో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. తన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ తో సినిమాలను నెక్స్ట్ లెవల్లో నిలబెడుతున్నాడు భీమ్స్. తాజాగా ఆయన మ్యూజిక్ అందించిన మూవీ “మాస్ జాతర”. మాస్ మహారాజ్ రవితేజ(Bheems) హీరోగా వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవారపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మాస్ జాతర ప్రీ రిలేస్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో భీమ్స్ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

Ravi teja-Naveen Polishetty: రవి తేజతో నవీన్ పోలిశెట్టి మల్టీ స్టారర్.. రిజెక్ట్ చేసిన డైరెక్టర్ తో కాంప్రమైజ్ అవుతారా?

“ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయ్యాక కూడా అవకాశాలు రాలేదు. ఓసారి నా పరిస్థితిని వివరిస్తూ ఒక సెల్ఫీ వీడియో తీశాను. ఆ వీడియోలో నా భార్య, పిల్లలు ఉన్నారు. ఇంటికి అద్దె కట్టాలి, పిల్లల్ని చదివించాలి, ఎలా బతకాలి.. అనే ఆలోచనలు మైండ్ లో రన్ అవుతున్నాయి. ఆ చివరి క్షణంలో మీరు పీపుల్స్‌ మీడియా ఆఫీసుకు రావాలి అంటూ నాకో ఫోన్‌ వచ్చింది. ఆ ఒక్క ఫోన్ కాల్ నా జీవితాన్నే మార్చేసింది. ఆ కాల్ రావడానికి ముందు వరకు నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే.. భూమి మీద నూకలు చెల్లిపోయాయి, ఇక నాకు జీవితం లేదు, అందరం కలిసి చనిపోవాలి అనుకుంటున్నా. అదే క్షణంలో దేవుడి రూపంలో రవితేజ నుంచి కాల్ వచ్చింది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన లాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉంటే నాలాంటి వాళ్లు చాలా మంది వస్తూనే ఉంటారు. అందుకే రవితేజ గారంటే నాకు చాలా ఇష్టం” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు భీమ్స్‌.

ఇక భీమ్స్ మ్యూజిక్ విషయానికి వస్తే, మాస్ జాతర సినిమాలో ఆయన అందించిన పాటలు ఇప్పటికే చాట్ బ్లాస్టర్ అయ్యాయి. తూ మేరా లవ్వరు, హుడియో లాంటి సొగ్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక ట్రైలర్ లో చూసిన బీజీఎమ్ కూడా అదిరిపోయింది. అదే రేంజ్ లో సినిమాకు కూడా మాస్ మ్యూజిక్ అందించాడట భీమ్స్. కాబట్టి.. రవి తేజ, భీమ్స్ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ గా చెప్పుకొచ్చు.