Ravi teja-Naveen Polishetty: రవి తేజతో నవీన్ పోలిశెట్టి మల్టీ స్టారర్.. రిజెక్ట్ చేసిన డైరెక్టర్ తో కాంప్రమైజ్ అవుతారా?

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తోంది. (Ravi teja-Naveen Polishetty)బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నప్పటికి సౌత్ లో మాత్రం ఈ మధ్య ఎక్కువయ్యింది.

Ravi teja-Naveen Polishetty: రవి తేజతో నవీన్ పోలిశెట్టి మల్టీ స్టారర్.. రిజెక్ట్ చేసిన డైరెక్టర్ తో కాంప్రమైజ్ అవుతారా?

Producer Naga Vamsi to make a multi-starrer film with Ravi Teja-Naveen Polishetty

Updated On : October 29, 2025 / 8:05 AM IST

Ravi teja-Naveen Polishetty: ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తోంది. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నప్పటికి సౌత్ లో మాత్రం ఈ మధ్య ఎక్కువయ్యింది. స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి (Ravi teja-Naveen Polishetty)ఇష్టపడుతున్నారు. కనీసం, గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చే అవకాశం వచ్చిన వదులుకోవడం లేదు. ఇక ఆడియన్స్ కి ఇలాంటి సినిమాలు చూడటం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. ఒకే సినిమాలు తాము అభిమానించే ఇద్దరు స్టార్స్ ని చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా అలాంటి మరో క్రేజీ మల్టీ స్టారర్ మూవీ టాలీవుడ్ లో రానుంది.

Naveen Chandra: అమ్మా.. బ్రతికితే రవితేజలా బ్రతకాలి.. ఇది పొగడ్త కాదు.. నవీన్ చంద్ర ఎమోషనల్ కామెంట్స్..

ఆ మూవీ మరేదో కాదు రవి తేజ, నవీన్ పోలిశెటీ కాంబోలో రాబోతున్న సినిమా. అవును, ఈ ఇద్దరు ఎనర్జిటిక్ స్టార్స్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారట. రవి తేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంటర్టైన్మెంట్ స్టార్ గా ఎప్పుడో పేరుతెచ్చుకున్నాడు. ఇక నవీన్ పోలిశెట్టి గురించి ఎంత చెప్పనా తక్కువే. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాల్లో ఆయన పండించిన నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అలాంటి ఇద్దరు ఎంటర్టైన్మెంట్ కింగ్స్ కలిసి ఒక సినిమా చేస్తే అది ఏ రేంజ్ లో ఉంటుంది. చెప్పడం కష్టమే కదా.

ఆ సాహసం నిర్మాత నాగ వంశీ చేయబోతున్నాడట. అవును, నాగ వంశీతో రవి తేజ “మాస్ జాతర”, నవీన్ పోలిశెట్టి “అనగనగ ఒకరాజు” సినిమాలు చేస్తున్నారు. ఆ చనువుతోనే ఈ కాంబో సెట్ చేశాడట నాగ వంశీ. ఇటీవలే ఈ ఇద్దరినీ కలిసి కథను వినిపించగా వెంటనే ఒకే చెప్పారట. ఇక ఈ సినిమాను మ్యాడ్ సినిమాను తెరకెక్కించిన కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తాడని టాక్ నడుస్తోంది. కానీ, నవీన్ పోలిశెట్టికి కళ్యాణ్ శంకర్ మధ్య కొన్ని విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ కారణంగానే అనగనగ ఒక రాజు సినిమా దర్శకుడిగా తప్పుకున్నాడు కళ్యాణ్ శంకర్. మరి ఇప్పుడు రవి తేజ సినిమా కోసం కళ్యాణ్ శంకర్ తో పని చేసేందుకు నవీన్ పోలిశెట్టి ఒప్పుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. కానీ, ఎప్పుడు వచ్చినా కూడా ఈ కాంబోలో వచ్చే సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అనే చెప్పాలి.