Rajamouli : ప్రభుదేవా పాటకు రాజమౌళి దంపతుల స్టెప్పులు.. రిహార్సల్స్ వీడియో చూశారా?
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Rajamouli and his wife rehearsals Andhamaina Prema rani Song dance video
Rajamouli dance video : టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెరకెక్కించే సినిమాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. తెలుగు సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా తీసుకువెళ్లిన ఘనత ఆయన సొంతం. వర్క్ విషయంలో ఏ మాత్రం రాజీ పడని జక్కన్న పర్సనల్ లైఫ్‌లో కాస్త సరదాగానే ఉంటారు. సమయం దొరికితే కుటుంబంతో కలిసి సరదాగా బయటికి వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు.
ఇప్పటి వరకు దర్శకుడిగా మాత్రమే తెలిసిన రాజమౌళి.. ఇటీవల తనలోని డ్యాన్సింగ్ కళను బయటకు తీసుకువచ్చారు. తన భార్య రమాతో కలిసి ఓ స్టేజి పై డాన్స్ వేసి వావ్ అనిపించారు. ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే’ పాటకు వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఈ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
JrNTR : జూనియర్ ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం..! వీడియో వైరల్..
కాగా.. తాజాగా ఈ పాటకు రాజమౌళి, రమా లు కలిసి రిహార్సల్స్ చేసిన వీడియో బయటకు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి ఈ వీడియోను చూసేయండి.
ఇదిలా ఉంటే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో కలిసి ఓ సినిమాను చేస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇండియానా జోన్స్, రాబిన్ హుడ్ రేంజ్ అడ్వెంచర్ స్టైల్లో ఈ చిత్రం ఉండబోతుందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా రెండు పార్టులు రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.
‘లవ్ గురు’ మూవీ రివ్యూ.. పెళ్లి ఇష్టం లేని భార్యతో ప్రేమగా ఎలా దగ్గరవ్వాలి..
SS Rajamouli Dance ?
— Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024