JrNTR : జూనియర్ ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం..! వీడియో వైరల్..
జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Jr NTR Almost Falls As Fans Push Him at Tillu Square Event
జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతో విదేశాల్లోనూ యంగ్ టైగర్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఇటీవల ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు.
సోమవారం హైదరాబాద్ లో ఈ సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఎన్టీఆర్ వస్తున్నాడు అని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు వచ్చారు. సక్సెస్ మీట్ అనంతరం తిరిగి ఎన్టీఆర్ కారు వద్దకు వెలుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఫ్యాన్స్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా కనిపిస్తోంది.
ఎన్టీఆర్‌ను చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. వారిని నిలువరించడం బౌన్సర్లకు కూడా చాలా కష్టంగా మారింది. తారక్ వైపుగా కొందరు ఫ్యాన్స్ దూసుకువచ్చారు. ఇంతలో ఓ ఫ్యాన్ బౌన్సర్లను దాటుకుని ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి కాళ్ల మీద పడబోయాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ పడిపోబోయాడు. వెంటనే బౌన్సర్లు తారక్‌ను గట్టిగా పట్టుకున్నారు.
Love Guru : ‘లవ్ గురు’ మూవీ రివ్యూ.. పెళ్లి ఇష్టం లేని భార్యతో ప్రేమగా ఎలా దగ్గరవ్వాలి..
అభిమానులు ఇబ్బంది పెడుతున్నా తారక్ మాత్రం ఎంతో ఓపికగా సహనంగా ఉన్నాడు. తారక్ కారు వద్దకు వెళ్లేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నీకు ఉన్న ఓపికకు హ్యాట్సాఫ్ తారక్ అన్నా అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇక దేవర సినిమా విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10న పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఏడేళ్ల పాటు హీరోయిన్ నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?
Niku Unna Patience Ki Hatsoff @tarak9999 Anna ????. Crowd ??.#Devara #ManOfMassesNTR #JrNTR pic.twitter.com/lDVYKz4OLT
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) April 10, 2024