ఏడేళ్ల పాటు హీరోయిన్ నంబ‌ర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?

మ‌ల‌యాళ స్టార్ హీరో ఉన్నిముకుంద‌న్ న‌టిస్తున్న చిత్రం జై గ‌ణేష్‌.

ఏడేళ్ల పాటు హీరోయిన్ నంబ‌ర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?

Unni Mukundan block Mahima Nambiar number for seven years

Updated On : April 10, 2024 / 7:19 PM IST

Unni Mukundan – Mahima Nambiar : మ‌ల‌యాళ స్టార్ హీరో ఉన్నిముకుంద‌న్ న‌టిస్తున్న చిత్రం జై గ‌ణేష్‌. రంజిత్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మ‌హిమ నంబియార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం గురువారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. ఓ ఇంట‌ర్వ్యూలో హీరోయిన్ మ‌హిమ నంబియార్ ఓ ఆస‌క్తిర విష‌యాన్ని వెల్ల‌డించారు. ఏడేళ్ల పాటు హీరో ఉన్నిముకుంద‌న్ త‌న నంబ‌ర్‌ను బ్లాక్ చేశాడ‌ని తెలిపింది.

ఉన్నిముకుంద‌న్, మ‌హిమా నంబియార్ లు 2017లో విడుద‌లైన మాస్ట‌ర్ పీస్ సినిమాలో క‌లిసి న‌టించారు. ఆ సినిమా విడుద‌లైన త‌రువాత ఉన్ని త‌న నంబ‌ర్‌ను బ్లాక్ చేశాడ‌ని మ‌హిమ తెలిపింది. స్రిప్ట్ రైట‌ర్ ఉద‌య్‌కృష్ణ ద‌గ్గ‌రి నుంచి ఉన్ని ముకుంద‌న్ నంబ‌ర్‌ను తీసుకున్నా. ఆ త‌రువాత ఆయ‌న‌కు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పంపాను. నేను మ‌హిమ‌ను. నేనెవ‌రో నీకు తెలుసుకు అని అనుకుంటున్నాను. ఉద‌యన్ నుంచి నీ నంబ‌ర్ తీసుకున్నా అని అన్నాను. ఆ వాయిస్ మెసేజ్‌లో ఉద‌య‌న్ అని రెండు మూడు సార్లు అన్నాను.

Gandhimathi Balan : సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత గాంధీమ‌తి బాల‌న్ క‌న్నుమూత‌

ఆ వాయిస్ మెసేజ్ విన‌గానే ఉన్ని నా నంబ‌ర్‌ను బ్లాక్ చేశాడు. ఎందుకు ఉన్ని త‌న నంబ‌ర్ బ్లాక్ చేశాడో నాకు అర్థం కాలేదు. ఆ త‌రువాత ఉద‌య‌న్‌కు ఉన్ని ఫోన్ చేశాడు. నేను అహంకారి అని, ఉద‌య‌న్ అని పిలుస్తోంద‌ని, ఓ సీనియ‌ర్‌ను ఇలాగేనా పిలిచేది అని అత‌డితో ఉన్ని చెప్పాడ‌ట‌. దీంతో ఏడేళ్ల పాటు నా నంబ‌ర్‌ను బ్లాక్ చేశాడు అంటూ మ‌హిళా నంబియార్ చెప్పింది. అయితే.. ఉదయకృష్ణతో తనకున్న పరిచయం వల్లే అతడిని ‘ఉదయన్’ అని ఆప్యాయంగా పిలిచాన‌ని, ఆ సమయంలో ఉన్నీకి ఆ వివరాలు తెలియవని మహిమ స్పష్టం చేసింది

దీనిపై ఉన్ని ముకుంద‌న్ స్పందించాడు. ఆ స‌మ‌యంలో కోపంతో ఆమె నంబ‌ర్‌ను బ్లాక్ చేసిన‌ట్లు ఉన్ని చెప్పుకొచ్చాడు. ఆ త‌రువాత నంబ‌ర్ బ్లాక్ చేసిన‌ విష‌యాన్నే తాను మ‌రిచిపోయిన‌ట్లు చెప్పుకొచ్చాడు. కొన్నేళ్ల త‌రువాత RDX సినిమా విజయం సాధించ‌డంతో ఆ సినిమాలో మ‌హిమ‌ను చూశాను. ఆ త‌రువాత రంజిత్ శంక‌ర్ సినిమాలో ఆమె న‌టిస్తుంద‌ని తెలిసిన వెంట‌నే ఆమె నంబ‌ర్‌ని బ్లాక్ చేసిన సంగ‌తి గుర్తుకు వ‌చ్చింద‌ని, వెంట‌నే ఆన్‌బ్లాక్ చేసి మెసేజ్ పంపిన‌ట్లు చెప్పాడు.

War 2 : వార్ 2లో ఎన్టీఆర్‌కి తండ్రిగా జగపతి బాబు చేస్తున్నారా.. నిజమేనా..!