Rajamouli : అందులో రామ్ గోపాల్ వర్మను స్పూర్తిగా తీసుకున్నా..
రాజమౌళి మాట్లాడుతూ.. ''మగధీర సినిమా తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు, ఎక్కువ రోజులు షూటింగ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. అనుకున్నట్టే 'ఈగ', 'మర్యాద రామన్న' సినిమాలు చేశాను. కానీ..........

Rajamouli
Rajamouli : రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అనేక వాయిదాల అనంతరం మార్చి 25న రిలీజ్ కానుంది. మరోసారి సినిమా ప్రమోషన్స్ ని భారీగా చేస్తున్నారు చిత్ర యూనిట్. రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
భారీ బడ్జెట్ తో సినిమాలు, ఎక్కువ రోజులు షూటింగ్ చేయడం రాజమౌళికి అలవాటు. అయితే ఒకానొక సమయంలో ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు, ఎక్కువ కాలం షూటింగ్స్ చేయను అని స్టేజి మీదే చెప్పారు. కానీ రాజమౌళి అన్ని అలాంటి సినిమాలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి రాజమౌళిని ప్రశ్నించగా దానికి సమాధానమిస్తూ ఆర్జీవి గురించి మాట్లాడారు.
NTR : నా భార్య బర్త్‌డే వదిలేసి చరణ్ కోసం వెళ్ళేవాడిని
రాజమౌళి మాట్లాడుతూ.. ”మగధీర సినిమా తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు, ఎక్కువ రోజులు షూటింగ్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. అనుకున్నట్టే ‘ఈగ’, ‘మర్యాద రామన్న’ సినిమాలు చేశాను. కానీ ‘బాహుబలి’ సినిమాతో అలా ఉండటం నా వల్ల అవ్వలేదు. భారీ బడ్జెట్ సినిమాలు తీయను అని చెప్పి మాట తప్పింది నిజమే కానీ అందుకు రామ్ గోపాల్ వర్మను స్పూర్తిగా తీసుకొని అబద్దం చెప్పాను” అని అన్నారు.
RRR : అమెరికాలో భారీగా ‘ఆర్ఆర్ఆర్’.. 1150 పైగా థియేటర్స్‌లో..
ఆర్జీవీ కూడా అనేక మాటలు చెప్తూ ఉంటారు. అవేవి జరగవు, అడిగితే నేను అబద్దం చెప్తాను, ఇచ్చిన మాట మీద నిలబడ్డాను అని చాలా సార్లు చెప్పారు. తాజాగా రాజమౌళి కూడా ఈ విషయంలో ఆర్జీవిని స్ఫూర్తిగా తీసుకున్నాను అని చెప్పడంతో ఈ వీడియో పాపులర్ అవుతుంది. ఆర్జీవీ అభిమానులు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.