Rajamouli: ఆ నటుడే తన ఇన్స్పిరేషన్ అంటున్న రాజమౌళి.. ఎవరది?
బాహుబలి సినిమాతో ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా చేసిన జక్కన. 'RRR'తో ఆ స్థాయిని మరింత పెంచాడు. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు 'టొరంటో'లో జరుగుతున్న "టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్"(TIFF)లో భారతీయ చిత్ర పరిశ్రమ తరుపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తనకి స్పెషల్ ఎఫెక్ట్స్ పై ఆకర్షణ ఎలా కలిగిందో, అందుకు ఇన్స్పిరేషన్ ఎవరన్నది తెలియజేసాడు.

Rajamouli Reveals his Major Inspiration at TIFF
Rajamouli: బాహుబలి సినిమాతో ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా చేసిన జక్కన. ‘RRR’తో ఆ స్థాయిని మరింత పెంచాడు. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు ‘టొరంటో’లో జరుగుతున్న “టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్”(TIFF)లో భారతీయ చిత్ర పరిశ్రమ తరుపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రపంచం నలుమూలల నుంచి సినీ సాంకేతిక నిపుణులు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరు కానున్నారు.
Mahesh Babu Rajamouli: జక్కన్నతో మహేష్ ఆట మొదలుపెట్టేది అప్పుడే..?
ఈ ఫెస్టివల్లో రాజమౌళి తన తరువాతి ప్రాజెక్ట్.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా థీమ్‌ను కూడా ఇటీవల వెల్లడించాడు. ఈ క్రమంలో తనకి స్పెషల్ ఎఫెక్ట్స్ పై ఆకర్షణ ఎలా కలిగిందో, అందుకు ఇన్స్పిరేషన్ ఎవరన్నది తెలియజేసాడు. రాజమౌళి మాట్లాడుతూ.. “నా సినిమాల్లో ఎమోషనల్ కనెక్షన్ పెంచడానికి స్పెషల్ ఎఫెక్ట్‌లను ఉపయోగించడం ప్రారంభించా, ఆ తరువాత ఈ ఎఫెక్ట్‌లను మరింతగా ఉపయోగించుకుంటే, ప్రేక్షకుడు కూడా సన్నివేశంలోని భావోద్యేగాని కంప్లీట్ గా ఫీల్ అవ్వగలడు అని అనిపించింది.
అటువంటి ఎమోషనల్ కనెక్షన్ కోసం నా సినిమాలలో స్పెషల్ ఎఫెక్ట్స్ ని ఎక్కువుగా వాడడం ప్రారంభించా. దీనికి నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ హాలీవుడ్ నటుడు మరియు దర్శకుడు “మెల్ గిబ్సన్”. అయన సినిమాలు ఉండే ఎమోషన్స్.. యూనివర్సల్ ఎమోషనల్ అప్పీల్‌ను కలిగి ఉంటాయి. వాటిని తెలియ చేసే విధానంలో అయన వర్క్ కి నా కృతజ్ఞతలు” అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు.