కరోనా బారినపడ్డ డా.రాజశేఖర్ ఫ్యామిలీ.. కోలుకున్న కుమార్తెలు..

  • Published By: sekhar ,Published On : October 17, 2020 / 01:54 PM IST
కరోనా బారినపడ్డ డా.రాజశేఖర్ ఫ్యామిలీ.. కోలుకున్న కుమార్తెలు..

Updated On : October 17, 2020 / 2:56 PM IST

Rajasekhar Family Corona: యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ సహా ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈయన కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారు.


జీవిత, రాజశేఖర్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
వీరికి వారం రోజుల క్రితమే కరోనా సోకగా.. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. పిల్లలు పూర్తిగా కోలుకున్నారు, ప్రస్తుతం మా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.. నేను, జీవిత త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తాం అంటూ రాజశేఖర్ ట్వీట్ చేశారు.


‘గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో హిట్స్ అందుకున్న రాజశేఖర్‌ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు నీలకంఠ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ త్వరలో మొదలు కావాల్సి ఉంది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటుడు నాగబాబు, సంగీత దర్శకుడు కీరవాణి, నటి తమన్నా కోవిడ్‌-19 బారిన పడి కోలుకున్న సంగతి విదితమే. షూటింగులో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు.