Rajendraprasad : డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన రాజేంద్రప్రసాద్.. మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాం.. నేను కావాలని అనలేదు అయినా..
రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్ తో ఉన్న చనువుతో సరదాగా నవ్వుతూనే అనుకోకుండా ఓ బూతు పదంతో మాట్లాడారు.

Rajendraprasad says sorry for david Warner Fans for Robinhood Pre Release Event Speech
Rajendraprasad : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో తెలుగు సినిమాల డైలాగ్స్, సాంగ్స్ తో రీల్స్ చేసి మెప్పించిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు వెండితెరపైనే కనపడబోతున్నాడు. రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.
అయితే ఈ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్ తో ఉన్న చనువుతో సరదాగా నవ్వుతూనే అనుకోకుండా ఓ బూతు పదంతో మాట్లాడారు. ఆయన సరదాగా అన్నారు, కావాలని అనలేదు అనేది ఆ స్పీచ్ చూస్తే ఎవ్వరికైనా అర్ధమవుతుంది. కానీ కొంతమంది కేవలం ఆ ఒక్క బూతు పదం షేర్ చేస్తూ రాజేంద్రప్రసాద్ ని విమర్శించారు. దీంతో నేడు రాజేంద్రప్రసాద్ దానిపై క్లారిటీ ఇచ్చారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నాకు డేవిడ్ వార్నర్ అంటే ఇష్టం. అతని క్రికెట్ అంటే ఇష్టం. అతను మన తెలుగు సినిమాలను ఇష్టపడతాడు. నాకు తెలిసి ఒకరికి ఒకరం సినిమా సమయంలో బాగా క్లోజ్ అయ్యాం. ఈ జరిగిన సంఘటన ఎవర్నైనా బాధపెట్టి ఉంటే, నేను ఉద్దేశపూర్వకంగా అన్నది కాకపోయినా అయినా కుడా నేను మీ అందరికి సారీ చెప్తున్నాను. అలాంటిది మళ్ళీ ఎప్పుడూ జరగదు అని చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
#DavidWarner కు సారీ చెప్పిన #RajendraPrasad pic.twitter.com/Je75NA1dxB
— Sai Satish (@PROSaiSatish) March 25, 2025