బీ రెడీ తలైవా ఫ్యాన్స్‌ : దర్బార్ ట్రైలర్ వచ్చేస్తోంది. 

  • Published By: madhu ,Published On : December 15, 2019 / 12:29 PM IST
బీ రెడీ తలైవా ఫ్యాన్స్‌ : దర్బార్ ట్రైలర్ వచ్చేస్తోంది. 

Updated On : December 15, 2019 / 12:29 PM IST

తలైవ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు శుభవార్త వినిపించింది. దర్బార్ చిత్ర యూనిట్. 2019, డిసెంబర్ 16 సోమవారం సాయంత్రం 6.30 ని.లకు చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నట్లు దర్శకుడు మురుగుదాస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉండమని అభిమానులతో చెప్పారాయన. ఈ వార్త విన్న రజనీకాంత్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. తమ అభిమాన నటుడి ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్‌ ద్వారా సినిమా అంచనాలు మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. 

ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా..తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి రజనీకాంత్ జన్మదినమైన డిసెంబర్ 12వ తేదీన ట్రైలర్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ ఆ రోజు ఎలాంటి ట్రైలర్ విడుదల కాకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ సినిమాలో నివేదా థామస్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య తదితరులు నటించారు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించారు. 

Read More : ఇక సెలవు : గొల్లపూడి అంత్యక్రియలు పూర్తి

* తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. 
* అనిరుద్ సంగీత సారథ్యం వ‌హించిన ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ చెన్నైలో జ‌రిగింది.
* సస్పెన్స్‌తోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందిందని రజనీ వెల్లడించారు. 
* ‘ద‌ర్బార్‌’ తో న‌మ్మ‌కాన్ని వమ్ము చేయ‌నని తెలిపారు రజనీకాంత్.