తమిళనాట రచ్చ రంబోలానే
సూపర్ స్టార్ రజినీకాంత్ పేట్టా, తళ అజిత్ విశ్వాసం సినిమాలు తమిళనాట సంక్రాంతి బరిలో దిగుతున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ పేట్టా, తళ అజిత్ విశ్వాసం సినిమాలు తమిళనాట సంక్రాంతి బరిలో దిగుతున్నాయి.
తెలుగులో సంక్రాంతికి ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2 సినిమాలు రిలీజవుతున్నాయి. మధ్యలో రజినీకాంత్ పేట కూడా ఈ లిస్ట్‌లోకి వచ్చి చేరింది. మొత్తంగా టాలీవుడ్‌లో పెద్ద పండగకి నాలుగు సినిమాలు పోటీ పడుతుంటే, కోలీవుడ్‌లో మాత్రం రెండు సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది. సూపర్ స్టార్ రజినీకాంత్ పేట్టా, తళ అజిత్ విశ్వాసం సినిమాలు తమిళనాట సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. రజినీక తమిళ్‌లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. 2.ఓ రిలీజ్ అయిన 40 రోజుల గ్యాప్‌లో పెట్టాగా సూపర్ స్టార్ సందడి చెయ్యనున్నాడు.
ఇక అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు. విశ్వాసం ట్రైలర్ ఇప్పటికే యూట్యాబ్‌లో రికార్డుల మోత మోగిస్తుంది. తమిళనాడు అజిత్ ఫ్యాన్స్ ఈ సారి ఎప్పుడూ లేనంత హంగామా చేస్తున్నారు. పైగా విశ్వాసం జపాన్‌లో కూడా రిలీజవనుంది. ఇప్పటికే పెట్టా, విశ్వాసం సినిమాలకు పెద్ద ఎత్తున టికెట్ బుకింగ్స్ జరిగిపోతున్నాయి. రెండు సినిమాలూ జనవరి 10నే విడుదల కానుండడంతో, 9వ తేదీ రాత్రి లేదా, 10వ తేదీ తెల్లవారు ఝామునుండే బెన్‌ఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సంక్రాంతికి రజినీ, అజిత్ ఇద్దరిలో ఎవరిది పైచెయ్యి అవుతుందో చూడాలి మరి.