Rajmouli: బ్రహ్మాస్త్ర మూవీ స్టోరీ చెప్పేసిన రాజమౌళి..

బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ఆలియా భట్‌ కలిసి నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. రాజమౌళి తెలుగులో ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దింతో రాజమౌళి ఈ మూవీ గురించి చెబుతూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ..ఈ స్టోరీ హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుని రాసిన కథ. మన పురణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న శక్తులన్నిటిని కలిపి అస్త్రావర్స్ అని క్రియేట్ చేశాడు. ఈ అస్త్రావర్స్ అంటే ఏంటంటే....

Rajmouli: బ్రహ్మాస్త్ర మూవీ స్టోరీ చెప్పేసిన రాజమౌళి..

Rajmouli Reveals 'Brahmastra' Movie Story

Updated On : September 1, 2022 / 6:00 PM IST

Rajmouli: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ కలిసి నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా మొత్తం మూడు భాగాలుగా చిత్రం తెరకెక్కబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని, మౌని రాయ్, డింపుల్ కపాడియా లాంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. దర్శకధీరుడు రాజమౌళి తెలుగులో ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Brahmastra Pre Release Event : బాలీవుడ్ బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా టాలీవుడ్ స్టార్.. మాములుగా లేదుగా మన క్రేజ్..

కాగా రాజమౌళి ఈ మూవీ గురించి చెబుతూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ..”అయాన్ ముఖర్జీ గురించి నేను ఇప్పుడు మీకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన తీసిన ‘యే జవానీ హై దివానీ’ ఇండియన్ మూవీస్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయాన్ నన్ను 2016లో కలిసి బ్రహ్మస్త్ర కథ చెప్పాడు. ఈ స్టోరీ హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుని రాసిన కథ. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న శక్తులన్నిటినీ కలిపి అస్త్రావర్స్ అని క్రియేట్ చేశాడు.

Brahmastra: బ్రహ్మాస్త్ర విజన్.. మామూలుగా లేదుగా!
ఈ అస్త్రావర్స్ అంటే ఏంటంటే, మన శాస్త్రాల ప్రకారం మనిషి మనుగడకు మూలకారణం పంచభూతాలు. అలాంటి పంచభూతాలను శాసించే శక్తి బ్రహ్మ శక్తి. బ్రహ్మస్త్ర కథ ఆ బ్రహ్మ శక్తి నుంచి పుట్టిన అస్త్రాల గురించి.. ఆ అస్త్రాలను ఉపయోగించే సూపర్ హీరోల గురించి. ఉదాహారణకు వానరాస్త్ర అంటే కింగ్ కాంగ్‌కు ఉన్నంత బలం ఉంటుంది. ఈ అస్త్రాన్ని ధరించిన వారు కింగ్ కాంగ్ ఎంత దూరం ఎగరగలదో అంత దూరం ఎగరగలుగుతారు. అంత బలం ఉంటుంది. అలాగే అగ్ని అస్త్ర, ఈ అస్త్రం ఉన్నవాళ్లు అగ్నిని కంట్రోల్ చేసి వాళ్లకి అనుగుణంగా మలుచుకోవడం. ఇలా చాలా అస్త్రాలు ఉన్నాయి. వీటన్నిటి కన్నా అద్భుతమైన ఫోర్స్ ఒకటి ఉంది.. అదే ప్రేమ. ఇద్దరి మధ్య ప్రేమ ఎలాంటి శక్తినైనా ఎదురుకోగలదు అని విజువల్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి విజువల్ వండర్ గా ఈ సినిమాలో చూపించారు” అంటూ చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా కథను రాజమౌళి ముందుగానే రివీల్ చేయడంతో ప్రస్తుతం నెటిజన్లు దీనిగురించి చర్చించుకుంటున్నారు.