Raju Gari Kodi Pulao : రాజుగారి కోడి పులావ్ మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్..

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాజుగారి కోడిపులావ్. శివ కోన స్వీయ దర్శకత్వంలో ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశిక్, ప్రాచీ థాకేర్, రమ్య దేష్, అభిలాష్ బండారి లు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఆగ‌స్టు 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Raju Gari Kodi Pulao : రాజుగారి కోడి పులావ్ మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్..

Raju Gari Kodi Pulao success meet

Updated On : August 5, 2023 / 7:16 PM IST

Raju Gari Kodi Pulao success meet : ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాజుగారి కోడిపులావ్. శివ కోన స్వీయ దర్శకత్వంలో ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశిక్, ప్రాచీ థాకేర్, రమ్య దేష్, అభిలాష్ బండారి లు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఆగ‌స్టు 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావ‌డంతో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శితమ‌వుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విజయోత్సవాన్ని మీడియాతో పంచుకున్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. ముందుగా మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందంటే అందుకు కార‌ణం మీడియా రాసిన రివ్యూ అని, ఈ రోజుల్లో పబ్లిక్ టాక్ కన్నా వెబ్‌సైట్స్‌ రివ్యూలను చదివే సినిమాలు చూస్తున్నారన్నారు. సినిమా విడుదల రోజు కొంచెం భయంగా ఉండిందని, తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో రిలీఫ్ గా ఫీల్ అయిన‌ట్లు చెప్పారు. సినిమా చూడని వాళ్ళు కచ్చితంగా థియేటర్లో రాజు గారి కోడి పులావ్ ను రుచి చూస్తే కచ్చితంగా థ్రిల్ గా ఫీల్ అవుతార‌ని అన్నారు.

Adah Sharma : సినిమాల‌కు అదాశ‌ర్మ విరామం..! త‌న ఆరోగ్యంపై సోష‌ల్ మీడియాలో పోస్ట్‌..

హీరోయిన్ నేహా దేశ్ పాండే మాట్లాడుతూ.. అన్ని చోట్ల నుండి సినిమాకి పాజిటివ్ వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సినిమాలో కంటెంట్ కొంచెం ఎక్కువ బోల్డ్ గా చూపించారని అంటున్నారు. నిజానికి బయట జరుగుతుందే సినిమాలో అదే చూపించామన్నారు. సినిమాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల‌ని కోరారు.

తెరమీద యాక్టర్స్ అందంగా కనిపించడం కోసం యూనిట్ ఎంత కష్ట పడుతుందో సినిమా చూసినప్పుడు అర్థమైందని హీరో అభిలాష్ బండారి అన్నారు. సినిమా నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సినిమా షూటింగ్ తర్వాత డబ్బింగ్ అని, రీషూట్స్ అని ఇలా ఏం చేసినా దీని వెనక డైరెక్టర్ యాక్టర్ శివ కోన ఉన్నారని ధైర్యంగా ఉండేదన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శివ కోన కు, న‌టుడు ప్ర‌భాక‌ర్‌కు ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా విడుదల రోజు వైజాగ్ లో థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు చాలా పాజిటివ్ గా అనిపించిందని చెప్పారు.

Chiranjeevi : క్లీంకార విషయంలో చిరు చెప్పింది నిజమేనా..? కోకాపేట భూముల ధరకు మెగా వారసురాలికి సంబంధం..!

డైరెక్టర్ హీరో నిర్మాత శివ కోన మాట్లాడుతూ.. తాము ఇండిపెండెంట్గా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీశామని, మా వెనక పెద్ద ప్రొడక్షన్ అవధులు కానీ బడా నిర్మాతలు కానీ లేరన్నారు. తామంతా సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమేనని చెప్పారు. అలా వచ్చిన మేము ఫుల్ మూవీ తీయగలమా అనే అనుమానం నుంచి, కేవలం కథను, ప్రొడక్షన్ వాల్యూస్ ను నమ్ముకొని ఈ సినిమా తీశామని చెప్పారు. సినిమా కంటెంట్ నచ్చి మీడియా మిత్రులు చాలా పాజిటివ్ రివ్యూస్ రాశారన్నారు. అదే మాదిరిగా సినిమాను ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తే బాగుంటుందని తెలిపారు. చాలామంది సినిమా ఫస్ట్ హాఫ్ హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉందని అంటున్నారు సినిమాలో పాటలు గాని అనవసరమైన సీన్లు కానీ సపరేట్ కామెడీ ట్రాక్స్ కానీ లేకుండా ఆధ్యాంతం కట్టిపడేసేలా తెరకెక్కించారని అందరూ మెచ్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని డైరెక్టర్ శివ కోన తెలిపారు.