Rajyasabha : ఆస్కార్ సాధించిన RRR చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించిన రాజ్యసభ

తాజాగా నేడు భారత రాజ్యసభలో ఆస్కార్ అవార్డు గ్రహీతలు RRR యూనిట్, ఎలిఫాంట్ విష్పరర్స్ లను ప్రస్తావిస్తూ రాజ్యసభ సభ్యులు అందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ.............

Rajyasabha : ఆస్కార్ సాధించిన RRR చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించిన రాజ్యసభ

rajyasabha special appraisals to oscar winners

Updated On : March 14, 2023 / 12:49 PM IST

Rajyasabha :  ప్రపంచ సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూసిన ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా ముగిసింది. పలు రకాల కేటగిరీలలో దేశ విదేశాల నుంచి వచ్చిన అనేక సినిమాలు ఆస్కార్ అవార్డులు అందుకున్నాయి. మన ఇండియా నుంచి నామినేట్ అయిన వాటిల్లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫాంట్ విష్పరర్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డులు అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాయి. దీంతో నిన్నటి నుంచి రాజమౌళికి, కీరవాణి, చంద్రబోస్ లకు, RRR చిత్రయూనిట్ కి దేశ విదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

Rajamouli Oscar Success Party : ఆస్కార్ తర్వాత స్పెషల్ పార్టీ అరేంజ్ చేసిన రాజమౌళి.. పియానో వాయించిన కీరవాణి.. సందడి చేసిన RRR టీం..

తాజాగా నేడు భారత రాజ్యసభలో ఆస్కార్ అవార్డు గ్రహీతలు RRR యూనిట్, ఎలిఫాంట్ విష్పరర్స్ లను ప్రస్తావిస్తూ రాజ్యసభ సభ్యులు అందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న RRR, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర బృందాలకు అభినందనలు. ఆస్కార్ విజయం భారతీయ కళాకారుల యొక్క అపారమైన ప్రతిభ, సృజనాత్మకత, నిబద్ధత అంకితభావానికి ప్రపంచ ప్రశంసలను ప్రతిబింబిస్తాయి. భారత చలనచిత్ర ఎదుగుదల గుర్తింపుకి ఆస్కార్ విజయం మరొక కోణం అని అన్నారు.