Rakshit Atluri : ‘పలాస’ సక్సెస్‌ని నేను వాడుకోలేదు.. ఆ కాంటెస్ట్ కోసం 1000 సిల్వర్ కాయిన్స్ ఆల్రెడీ కొన్నాను..

ఆపరేషన్ రావణ్ సినిమా చూసి ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెట్టి చెప్తే సిల్వర్ కాయిన్స్ ఇస్తామని ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Rakshit Atluri : ‘పలాస’ సక్సెస్‌ని నేను వాడుకోలేదు.. ఆ కాంటెస్ట్ కోసం 1000 సిల్వర్ కాయిన్స్ ఆల్రెడీ కొన్నాను..

Rakshit Atluri Interesting Comments on Operation Raavan Movie and his Career

Rakshit Atluri : పలాస, నరకాసుర.. సినిమాలతో మెప్పించిన రక్షిత్ అట్లూరి ఇప్పుడు ఆపరేషన్ రావణ్ సినిమాతో రాబోతున్నాడు. రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా సుధాస్ మీడియా బ్యానర్ పై ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో వెంకట సత్య దర్శకత్వంలో ఆపరేషన్ రావణ్ సినిమా తెరకెక్కింది. రాధికా శరత్ కుమార్, రఘు కుంచె, చరణ్ రాజ్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించగా ఈ సినిమా జులై 26న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రక్షిత్ అట్లూరి తాజాగా మీడియాతో ముచ్చటించారు.

రక్షిత్ అట్లూరి ఆపరేషన్ రావణ్ సినిమా గురించి మాట్లాడుతూ.. కరోనా సమయంలోనే ఆపరేషన్ రావణ్ కథ మొదలైంది. పలాస తర్వాత మా బ్యానర్ లో థ్రిల్లర్ సినిమా చేయాలనుకున్నాక దీనిపై వర్క్ మొదలుపెట్టాము. సైకోగా మనుషులు ఎందుకు మారతారు అనేది ఒక విజువల్ రూపంలో చూపించాము. మనలో ఆలోచనల్లో జరిగే యుద్దాన్ని చూపించే ప్రయత్నం ఎవరూ చేయలేదు, అది మేము చేసాము. సైకో ఆలోచనలు విజువల్ అయ్యే సీన్ ఒకటి బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో నేను ఒక టీవీ రిపోర్టర్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది అని తెలిపారు.

Also Read : Game Changer : రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌కు పండ‌గే.. ‘గేమ్ ఛేంజ‌ర్’ పై త‌మ‌న్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ల గురించి చెప్తూ.. ఈ సినిమా యాక్షన్ సీన్స్ తోనే షూటింగ్ మొదలుపెట్టాము. మొదట్లోనే లెగ్ కి ఇంజ్యురి అయింది. బైక్ నుంచి కంటెయినర్ మీదకు దూకే యాక్షన్ సీన్ లో గాయాలు అయ్యాయి. డూప్ లేకుండా స్టంట్స్ నేనే స్వయంగా చేశాను అని తెలిపారు.

తన తండ్రే ఈ సినిమాని డైరెక్ట్ చేయడం గురించి మాట్లాడుతూ.. నాన్న గారికి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది. పలాస కథ విషయంలో కూడా ఆయన సపోర్ట్ చేసారు. ఆపరేషన్ రావణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ లోనే బాగా కస్టపడి అంతా ప్లాన్ గా చేసుకున్నారు నాన్న. షూటింగ్ టైంలో డైరెక్టర్ – హీరోలాగే ఉండేవాళ్ళం. నాన్న దర్శకత్వంలో నటించడం అవకాశం ఎంతమందికి వస్తుంది, అది నా అదృష్టం. నేను ఆయనకు చెప్పేంత వాడిని కాదు, ఆయనే నన్ను గైడ్ చేస్తారు. సినిమాలోని ఆర్టిస్టులంతా నాన్న డైరెక్షన్ పట్ల హ్యాపీగా ఉన్నారు అని తెలిపారు.

ఆపరేషన్ రావణ్ సినిమా చూసి ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెట్టి చెప్తే సిల్వర్ కాయిన్స్ ఇస్తామని ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ గురించి రక్షిత్ మాట్లాడుతూ.. ఎక్కువమంది ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి ఈ సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ప్రకటించాము. హైదరాబాద్ తో పాటు విజయవాడ, వైజాగ్, పలు నగరాల్లో మేమే అక్కడికి వెళ్లి ప్రేక్షకులని కలిసి ఇస్తాము. ఆల్రెడీ వెయ్యి సిల్వర్ కాయిన్స్ చేయించి పెట్టాము అని తెలిపారు.

Polimera 2 issue : ఫిలిం ఛాంబ‌ర్‌ను ఆశ్ర‌యించిన పొలిమేర 2 నిర్మాత‌..

ఇక ఈ సినిమాలో సైకోకు ఒక మాస్క్ పెట్టారు. దాని గురించి చెప్తూ.. ఆన్లైన్ లో చాలా మాస్క్ లు చూసాము. అన్ని కొని తెచ్చినలాగే ఉన్నాయి. ఒక సైట్ లో ఓ కొత్త రకం మాస్క్ కనిపిస్తే దాన్ని తెచ్చి ఒక సైడ్ ఆ మాస్క్ ఉంచి ఇంకో సైడ్ మేమే డిజైన్ చేయించాము. మాస్క్ లో పులి, సింహం, తోడేలు.. లాంటి జంతువులను పోలినట్లు డిజైన్ చేసాము అని తెలిపారు రక్షిత్.

అలాగే పలాస సినిమాతో వచ్చిన సక్సెస్ ని నేను సరిగ్గా వినియోగించుకోలేదని, రెండేళ్లు కరోనా, ఒక సంవత్సరం నరకాసుర సినిమా గెటప్ కోసం అలా ఉండిపోయాను. ఈ గ్యాప్ లో నాకు కొన్ని సినిమాలు వచ్చాయి. అవి చేసి ఉంటే కెరీర్ ఇంకా బాగుండేదేమో, ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాను అని అన్నారు. సీరియస్ రోల్స్ మాత్రమే కాకుండా శశివదనే లాంటి లవ్ స్టోరీలు కూడా చేస్తున్నాను, కామెడీ సినిమా చేయాలని ఉందని తెలిపారు హీరో రక్షిత్.