Rakul Preet Singh : శాంటా ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అతడే.. రకుల్ ప్రీత్!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన 'రకుల్ ప్రీత్ సింగ్'కి ఇప్పుడు ఇక్కడ ఛాన్సులు అందకపోవడంతో ముంబై చెక్కిసింది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 'జాకీ భగ్నానీ'తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న క్రిస్మస్ రోజునే ప్రియుడు జాకీ బర్త్ డే కూడా కావడంతో, రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

Rakul Preet Singh emotional post on her lover

Rakul Preet Singh : టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ‘రకుల్ ప్రీత్ సింగ్’కి ఇప్పుడు ఇక్కడ ఛాన్సులు అందకపోవడంతో ముంబై చెక్కిసింది. అక్కడ వరుస సినిమాలో నటిస్తూ వస్తున్న రకుల్‌.. ఈ ఏడాది 5 సినిమాలు విడుదల చేసిన ఒక్కటి కూడా హిట్టుని అందించలేకపోయింది. అయినా సరే ఈ అమ్మడి చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘ఇండియన్-2’.

Rakul Preet Singh : క్లాసికల్ లుక్స్‌లో రకుల్ అందాలు..

ఇక ఈ అమ్మడు బాలీవుడ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ‘జాకీ భగ్నానీ’తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న క్రిస్మస్ రోజునే ప్రియుడు జాకీ బర్త్ డే కూడా కావడంతో, రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. “నా జీవితంలో శాంటా నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ నువ్వే. హ్యాపీ బర్త్ డే మై లవ్. నీలా నువ్వుంటూ, ఆనందాలతో నా జీవితాన్ని కూడా అందంగా మార్చినందుకు థాంక్యూ.

అంతేకాదు నన్ను నిత్యం ప్రోత్సహిస్తూ, నా కోపాన్ని కంట్రోల్ చేస్తూ వస్తునందుకు కూడా థాంక్యూ. నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉంటూ, నువ్వు అనుకున్న కలలని సాధించాలని కోరుకుంటున్నా” అంటూ ఎమోషనల్ అవుతూ ప్రియుడుతో దిగిన సెల్ఫీని షేర్ చేసింది. కాగా ఈ భామ బెంగళూర్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉండడంతో, ఇటీవల హైదరాబాద్ లో ఈడి విచారణకి హాజరయ్యింది.