Rakul Preet Singh : త్వరగా అలిసిపోతున్నాను.. రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా కోలుకోలేదా? వెన్నునొప్పితో బాధపడుతుందా?
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తన వెన్నునొప్పి సమస్య గురించి మాట్లాడింది.

Rakul Preet Singh gives Clarity about her Back Pain Injury
Rakul Preet Singh : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ అక్కడ నిర్మాతని పెళ్లి చేసుకొని సెటిలైపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల నెల రోజుల క్రితం రకుల్ జిమ్ చేస్తూ ఎక్కువ బరువు లిఫ్ట్ చేయడంతో వెన్నునొప్పి సమస్య వచ్చిందని, వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తప్పదని పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ రకుల్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
కొన్ని రోజుల తర్వాత రకుల్ తన సోషల్ మీడియాలో పలు ఫొటోలు షేర్ చేయడంతో పూర్తిగా నయం అయిపోయిందేమో అనుకున్నారు అంతా. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ తన వెన్నునొప్పి సమస్య గురించి మాట్లాడింది.
Also Read : Sitara-Sukriti : సుకుమార్ కూతురితో మహేష్ కూతురు.. ఫొటోస్ చూసారా..
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి గాయం తగ్గడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుంది. ఇప్పటికి ఆరు వారాలు పూర్తయింది. మరో రెండు వారాల్లో నేను పూర్తిగా తిరిగి వస్తాను. ఇప్పుడు కొంచెం బెటర్ గానే ఉంది. నొప్పి లేకుండా నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. లేచి నడుస్తున్నాను. కానీ త్వరగా అలిసిపోతున్నాను. నేను మరింత స్ట్రాంగ్ గా తయారవ్వాలి. ప్రస్తుతానికి అయితే చాలా వరకు బాగానే ఉన్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను అని తెలిపింది.
అలాగే తాను కోలుకోవడానికి తన భర్త బాగా సహకరించాడని, అన్ని పనులు ఆయనే చేసాడని తెలిపింది. దీంతో రకుల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తుంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.