Rakul Preet Singh : రకుల్ ఉంటే సీక్వెల్ సినిమా ఫ్లాప్.. పాపం రకుల్ అంటూ..

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సీక్వెల్స్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయని ఓ వార్త వైరల్ అవుతుంది.

Rakul Preet Singh : రకుల్ ఉంటే సీక్వెల్ సినిమా ఫ్లాప్.. పాపం రకుల్ అంటూ..

Rakul Preet Singh Sequel Movies goes Continues Flops new Sentiment goes Viral

Updated On : July 20, 2024 / 9:47 AM IST

Rakul Preet Singh : కెరటం సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో మంచి హిట్ కొట్టింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించి కొన్ని కమర్షియల్ హిట్స్ సాధించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ ఆఫర్ రావడంతో అందరి హీరోయిన్స్ లాగే అక్కడికి చెక్కేసింది.

అయితే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హిట్స్ మాత్రం రావట్లేదు. అయితే తాజాగా రకుల్ గురించి ఓ చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. అసలే రకుల్ ప్రీత్ సింగ్ కి హిట్ సినిమాలు కరువయ్యాయి. బాలీవుడ్ కి పూర్తిగా వెళ్లిపోవడంతో తెలుగులో కూడా ఆఫర్స్ కరువయ్యాయి. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ భారతీయుడు 2 సినిమాలో సిద్దార్థ్ సరసన కనిపించింది. భారతీయుడు 2 సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా పరాజయమే అంటున్నారు.

Also Read : Trivikram – Allu Arjun : బన్నీ కోసం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్న త్రివిక్రమ్.. అసలు ఆట ఇప్పుడు మొదలు..

అయితే రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సీక్వెల్స్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయని ఓ వార్త వైరల్ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే తెలుగులో రవితేజ సరసన కిక్ 2 సినిమాలో నటించగా ఆ సినిమా ఫ్లాప్ అయింది. సూపర్ హిట్ కిక్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కిక్ 2 ఫ్లాప్ గా మిగిలింది. అలాగే నాగార్జున కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన సినిమా మన్మధుడు. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మన్మధుడు 2లో రకుల్ ప్రీత్ సింగ్ నటించగా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఇండియన్ సినిమా పెద్ద హిట్ కానీ ఇండియన్ 2 సినిమా ఫ్లాప్.

ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కథ, కథనం.. ఇలా రకరకాల కారణాలు ఉన్నా ఈ మూడు సినిమాలకు కామన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఉండటంతో రకుల్ ఉంటే సీక్వెల్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇలాంటి కామెంట్స్ గతంలో కూడా పలువురు హీరోయిన్స్ కి వచ్చాయి. ఫ్లాప్, హిట్ అనేవి ఏ సెంటిమెంట్ తోను ఆధారపడి ఉండకపోయినా కామన్ గా ఒక రెండు, మూడు సినిమాల్లో కనిపిస్తే హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్.. ఇలా ఎవరికో ఒకరికి ఆ ఫ్లాప్స్ ని అంటగడతారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి అయినా నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ లాగే ఇది కూడా. ఇక రకుల్ ప్రస్తుతం ప్రేమించి పెళ్లి చేసుకొని భర్త జాకీ భగ్నానీతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది.