Ram Charan-Upasana: మరోసారి తండ్రికాబోతున్న రామ్ చరణ్.. సంబరాల్లో మెగా ఫ్యామిలీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు మరోసారి పేరెంట్స్ కాబోతున్నారు.(Ram Charan-Upasana) దీపావళి పండుగ సందర్బంగా తెలిసి శుభవార్త కావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు.

Ram Charan-Upasana: మరోసారి తండ్రికాబోతున్న రామ్ చరణ్.. సంబరాల్లో మెగా ఫ్యామిలీ

Ram Charan and Upasana are going to become parents again

Updated On : October 23, 2025 / 3:29 PM IST

Ram Charan-Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు మరోసారి పేరెంట్స్(Ram Charan-Upasana) కాబోతున్నారు. దీపావళి పండుగ సందర్బంగా తెలిసి శుభవార్త కావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల విడుదల చేసింది మెగా ఫ్యామిలీ. ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Prabhas-Sukumar: ప్రభాస్-సుకుమార్ కాంబోలో మిస్సైన సినిమా.. వచ్చి ఉంటే డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యేది.. త్వరలోనే..

ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ సైతం హ్యాపీ ఫీలవుతున్నారు. మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, రామ్ చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కూతురు క్లింకార ఉన్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు బుచ్చిబాబు సనాతో “పెద్ది” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.