Prabhas-Sukumar: ప్రభాస్-సుకుమార్ కాంబోలో మిస్సైన సినిమా.. వచ్చి ఉంటే డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యేది.. త్వరలోనే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషీ ఉన్నారు. అక్టోబర్ 23 ప్రభాస్(Prabhas-Sukumar) బర్త్ డే సందర్బంగా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ కి ట్రేట్స్ ఇస్తూనే ఉన్నాడు.

Star director Sukumar missed a film with Prabhas
Prabhas-Sukumar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ ఖుషీ ఉన్నారు. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే సందర్బంగా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ కి ట్రేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఆయన నెక్స్ట్ సినిమాల నుంచి బిగ్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రభాస్-హను రాఘవపూడి సినిమా నుంచి ఫౌజీ టైటిల్ ను రివీల్ చేస్తూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ పోస్టర్ విడుదల చేశారు.(Prabhas-Sukumar) ఇక రాజాసాబ్, సాలార్ మేకర్స్ కూడా బర్త్ డే పోస్టర్స్ విడుదల చేశారు. దీంతో, వరుసగా వస్తున్న అప్డేట్స్ ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Chiru-Venky: మెగా మూవీలోకి విక్టరీ వెంకటేష్.. ఎంట్రీ వీడియో అదిరిపోయింది.. ఇంకా సినిమా సంగతి..
ఇదిలా ఉంటే, చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన కాంబో ఏదైనా ఉందంటే అది ప్రభాస్-సుకుమార్ కాంబో అనే చెప్పాలి. ఈ ఇద్దరు ఒక సినిమా చేస్తే చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, నార్మల్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. డైరెక్టర్ సుకుమార్ సైతం ప్రభాస్ తో సినిమా చేయాలనీ ఉందని ఇప్పటికే చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సాలిడ్ కాంబోలో సినిమా రానుంది అంటూ కూడా టాక్ నడుస్తోంది. అయితే, ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ప్రభాస్ తో ఇప్పటికే ఒక మూవీని ప్లాన్ చేశారు సుకుమార్. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అది వేరే హీరో చేతికి వెళ్లి బ్లాక్ బస్టర్ సాధించింది.
ఆ సినిమా మరేదో కాదు ఆర్య. అవును, సుకుమార్ మొదటి సినిమా ఆర్యను ముందు ప్రభాస్ తో చేయాలని అనుకున్నాడట. ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజుకి కూడా చెప్పాడట. కానీ, ప్రభాస్ నుంచి ఈ ప్రాజెక్టుపై ఎలాంటి స్పందన రాలేదట. ఆ తరువాత ఆ సినిమా అల్లు అర్జున్ చేతికి వెళ్లి క్లాసిక్ హిట్ గా నిలిచింది. అలా ప్రభాస్-సుకుమార్ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయ్యింది. ఈ న్యూస్ తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఆర్య సినిమా ప్రభాస్ చేసి ఉంటే డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రెజెంట్ ఈ ఇద్దరు టాప్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి, ఈ టైంలో ఈ ఇద్దరు ఒక సినిమా చేస్తే మాత్రం అది ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం.