Ram Charan: మహేష్, ప్రభాస్ లను అధిగమించిన చరణ్..

తన నటనపై విమర్శలు చేసేవారికి రంగస్థలం సినిమాతో అదిరిపోయే సమాధానం ఇచ్చాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. పల్లెటూరి కుర్రాడి పాత్రలో చెవిటి వాడిగా చరణ్ కనబరిచిన నటన అద్భుతమంటూ విమర్శకుల చేతే ప్రశంసలను అందుకునేలా చేసింది. ఇక "ఆర్ఆర్ఆర్" సినిమాలో తన నటవిశ్వరూపానికి ప్రపంచ సినీ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యిపోయారు. దీంతో రామ్ చరణ్...

Ram Charan: మహేష్, ప్రభాస్ లను అధిగమించిన చరణ్..

Ram Charan Beats Prabhas and Mahesh in Instagram followers

Updated On : October 18, 2022 / 12:31 PM IST

Ram Charan: తన నటనపై విమర్శలు చేసేవారికి రంగస్థలం సినిమాతో అదిరిపోయే సమాధానం ఇచ్చాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. పల్లెటూరి కుర్రాడి పాత్రలో చెవిటి వాడిగా చరణ్ కనబరిచిన నటన అద్భుతమంటూ విమర్శకుల చేతే ప్రశంసలను అందుకునేలా చేసింది. ఇక “ఆర్ఆర్ఆర్” సినిమాలో తన నటవిశ్వరూపానికి ప్రపంచ సినీ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యిపోయారు.

Ram Charan: విశ్వక్ సేన్ వ్యక్తిత్వానికి నేను వీరాభిమానిని.. రాంచరణ్!

దీంతో రామ్ చరణ్ ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గ్లోబల్ స్టార్ అంటూ అభినందనలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తన సొసైల్ మీడియా ఫాలోయర్స్ లిస్ట్ కూడా పెరిగిపోతుంది. 9 మిలియన్ ఫాలోయర్స్ తో చరణ్ ఇన్‌స్టాగ్రామ్ లో ప్రభాస్, మహేష్ లను అధిగమించాడు. కాగా ప్రభాస్ అండ్ మహేష్ 8.9 ఫాలోయర్స్ కలిగి ఉన్నారు.

RRR తో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకొనేలా, తన తదుపరి సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ గ్లోబల్ స్టార్. ఆ క్రమంలోనే ఇండియన్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో మొదటిగా చెప్పుకునే శంకర్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది.