Ram Charan : ఉమెన్స్ డే రోజు అమ్మ కోసం స్పెషల్ వంట చేసిన చరణ్.. ఏమేమి వండాడో తెలుసా? పక్కన ఉపాసన ఏమో..

నేడు ఉమెన్స్ డే అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాళ్ళ అమ్మ సురేఖ కోసం స్పెషల్ గా వంట చేసాడు.

Ram Charan : ఉమెన్స్ డే రోజు అమ్మ కోసం స్పెషల్ వంట చేసిన చరణ్.. ఏమేమి వండాడో తెలుసా? పక్కన ఉపాసన ఏమో..

Ram Charan Cooking for his Mother on Womens Day Special Upasana Shares Video goes Viral

Ram Charan : మెగా ఫ్యామిలిలో ఉన్న అనుబంధాలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. తాజాగా నేడు ఉపాసన(Upasana) ఓ వీడియో షేర్ చేసింది. గతంలో చిరంజీవి, రామ్ చరణ్ వంటలు వండుతుంటే వీడియోలు షేర్ చేశారు. తాజాగా నేడు ఉమెన్స్ డే అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాళ్ళ అమ్మ సురేఖ కోసం స్పెషల్ గా వంట చేసాడు.

చరణ్ వంట చేస్తుంటే అమ్మ సురేఖ పక్కనే ఉంది. ఉపాసన ఏమో ఇదంతా వీడియో తీస్తుంది. మొదట ఉపాసన వచ్చి.. అత్తమ్మ గారండీ ఈ రోజు మీ కిచెన్ లో ఏం అయితుంది అంటే, సురేఖ.. ఏమవుతుంది, దోస అయితుంది, నా కొడుకు నా కోసం వండుతున్నాడు. ఉమెన్స్ డే అని ఇవాళ తనే మనకు వండుతున్నాడు అని చెప్పింది. దీంతో ఉపాసన.. రోజూ ఉమెన్స్ డే ఉంటే బాగుండు అంది. ఇక చరణ్ వంట చేస్తుంటే ఏం వండుతున్నావు అని అడగ్గా.. దోస, పన్నీర్ టిక్కా మా అమ్మ కోసం అని చెప్పాడు.

Also Read : Mahesh Babu : మహేష్ బాబు కొత్త లుక్స్ చూశారా? హాలీవుడ్ హీరోలా ఉన్నాడ్రా బాబు..

ఈ వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అమ్మ కోసం వంట వండుతున్న చరణ్ వీడియో చూస్తుంటే క్యూట్ గా ఉంది.