Peddi : గ్లోబల్ స్టార్ చెప్పిన తర్వాత ఇంకా డౌట్ ఎందుకు.. వెనక్కి తగ్గని ‘పెద్ది’..

పెద్ది సినిమా షూటింగ్ పూర్తవకపోవడంతో ఇటీవల పెద్ది సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ వచ్చాయి. (Peddi)

  • Published On : April 1, 2026 / 08:01 PM IST

Peddi

Peddi : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రికెట్, కుస్తీ, విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓ సారి వాయిదా పడి ఏప్రిల్ 30న ఈ సినిమా వస్తుందని చెప్పారు.

అయితే ఇంకా పెద్ది సినిమా షూటింగ్ పూర్తవకపోవడంతో ఇటీవల పెద్ది సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ వచ్చాయి. జూన్ లేదా జులై లో పెద్ది వస్తుందని టాలీవుడ్ లో టాక్ నడిచింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే తాజాగా పెద్ది రిలీజ్ డేట్ పై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు.

Also Read : Band Melam : కంటెంట్ లేదు.. కలెక్షన్ లేదు.. ఆడియన్స్ తిడుతున్నా మీడియాపై ఫైర్ అయిన మూవీ టీమ్..

నిహారిక నిర్మాతగా తెరకెక్కిన రాకాస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ రామ్ చరణ్ ని కలిశారు. ఆ సినిమా గురించి మాట్లాడుతూ సరదాగా.. పెద్ది లేట్ అవ్వట్లేదు అని కొంచెం బాగా ప్రమోట్ చేయండి. బయట సినిమా వాయిదా పడుతుందని న్యూస్ వింటున్నాను అని అన్నారు. దీంతో పెద్ది సినిమా వాయిదా లేదు చెప్పిన డేట్ కి ఏప్రిల్ 30న వచ్చేస్తుందని క్లారిటీ వచ్చేసింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా డౌట్ ఎందుకు అని ఫ్యాన్స్ పెద్ది కోసం ఎదురుచూస్తున్నారు.

 

Also Read : Tovino Thomas : ఇక్కడ కలెక్షన్స్ కావాలి.. కానీ తెలుగు సినిమాలు చేయను అంటున్న మలయాళం స్టార్ హీరో..