Manithan Deivamagalam: ఓటీటీలో మరో అద్దిరిపోయే రియల్ స్టోరీ.. IMDBలో ఏకంగా 9 రేటింగ్.. అస్సలు మిస్ అవకండి!
సెల్వరాఘవన్ నటించిన మణిదన్ దైవమంగళం(Manithan Deivamagalam) మూవీ మే 1 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కి రానుంది
Selvaraghavan Manithan Deivamagalam streaming on Sun NXT from May 1st.
- మే 1న ఓటీటీలోకి ఎంట్రీ.
- ఎమ్మెల్యేపై సామాన్యుడి పోరాటం కథ.
- సెల్వరాఘవన్ నటించిన పవర్ ఫుల్ డ్రామా.
Manithan Deivamagalam: ప్రస్తుతం కాలంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కోవలోనే గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక పవర్ ఫుల్ సోషల్ డ్రామాగా ‘మణిదన్ దైవమంగళం(Manithan Deivamagalam)’ చిత్రం రూపొందింది. ఒక సామాన్యుడు వ్యవస్థలోని లోపాలను, ముఖ్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడే స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ఎదురయ్యే పరిణామాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సెన్సిటివ్ అంశాలైన మహిళలపై వేధింపులు, అధికార దుర్వినియోగం వంటి విషయాలను దర్శకుడు డెనిస్ మంజునాథ్ హృద్యంగా ఆవిష్కరించారు.
సినిమా కథాంశం విషయానికి వస్తే, ఊరిలో వడ్డీ వ్యాపారి ఇన్బరాజ్ అప్పు తీసుకున్న మహిళలను లైంగికంగా వేధిస్తూ అరాచకం సృష్టిస్తుంటాడు. ఈ క్రమంలోనే హీరో కుటుంబం కూడా ఈ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుంది. అన్యాయాన్ని సహించలేని హీరో, స్థానిక ఎమ్మెల్యేను నిలదీయడంతో వారి మధ్య ఘర్షణ మొదలవుతుంది. తన పరువు తీసిన హీరోపై ఎమ్మెల్యే పగ పెంచుకోవడంతో, హీరో కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేది ఈ సినిమాలోని ప్రధాన ఘట్టం. ఈ రస్టిక్ డ్రామాలో సెల్వరాఘవన్ నటన హైలైట్గా నిలవడమే కాకుండా, IMDBలో 9 రేటింగ్ సాధించడం విశేషం.
థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ విలేజ్ డ్రామా ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. మే 01 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కన్నడ నటి ఖుషీ రవి హీరోయిన్గా నటించగా, మైమ్ గోపీ కీలక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం తమిళంలోనే స్ట్రీమింగ్ కానున్నప్పటికీ, సెల్వరాఘవన్ కు ఉన్న క్రేజ్ రీత్యా తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారికి ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని అందిస్తుంది.
