Chiranjeevi – Charan : 16 ఏళ్ళ క్రిందట చిరు మాటల్ని.. ఇప్పుడు నిజం చేసిన చరణ్..

చిరంజీవి 16 ఏళ్ళ క్రిందట తెలుగు సినిమా వజ్రోత్సవం వేదిక పై కొన్ని ఎమోషనల్ మాటలు మాట్లాడారు. వీటిని రామ్ చరణ్ ఇప్పుడు..

Chiranjeevi – Charan : 16 ఏళ్ళ క్రిందట చిరు మాటల్ని.. ఇప్పుడు నిజం చేసిన చరణ్..

Ram Charan made 16 years back Chiranjeevi words into true

Updated On : November 21, 2023 / 8:37 PM IST

Chiranjeevi – Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్. హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చరణ్.. అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే వాటన్నిటికీ బాధపడకుండా తన పనితోనే సమాధానం చెబుతూ ముందుకు వెళ్లారు. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇప్పుడు 16 ఏళ్ళ క్రిందట చిరు మాటల్ని నిజం చేసి చూపించారు. దీంతో చరణ్ నిజం చేసిన ఆ విషయాన్ని, చిరు మాటలని కలిపి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వైరల్ చేస్తున్నారు అభిమానులు.

చిరంజీవి 16 ఏళ్ళ క్రిందట తెలుగు సినిమా వజ్రోత్సవం వేదిక పై కొన్ని ఎమోషనల్ మాటలు మాట్లాడారు. గోవా ఫిలిం ఫెస్టివల్ లో మన తెలుగు నటుల ఫోటోలు కనిపించడం లేదు. మన ఇండస్ట్రీలో ఉన్న ఎస్వీఆర్, ఏఎన్నార్, ఎన్టీఆర్ వంటి గొప్ప నటులకు అక్కడ సరైన గౌరవం లభించ లేదని.. అందరి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ఏడాది జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో రామ్ చరణ్ ఫోటో అక్కడ కనిపించింది. దీంతో తండ్రి మాటల్ని కొడుకే నిజం చేశాడు అంటూ అభిమానులు పోస్టులు వేస్తున్నారు.

Also read : ET10 : త్రిషకు చిరు అండ.. రెండు దేశాల్లో ఆ సినిమా బ్యాన్.. చరణ్, అర్జున్ స్పెషల్ పోస్టులు..

కాగా గత ఏడాది ఈ ఫిలిం ఫెస్టివల్ లో చిరంజీవి.. ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్’ అవార్డుని అందుకున్నారు. ఇప్పుడు అక్కడ రామ్ చరణ్ ఫోటో కనిపించడం మెగా అభిమానులను సంతోష పరుస్తుంది. ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఈ నెలాఖరు నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని, దాదాపు 20 రోజులు పాటు షూటింగ్ కంటిన్యూగా జరగనుందని సమాచారం. చిరంజీవి కొత్త సినిమా Mega154 ఈ నెలాఖరు నుంచే షూటింగ్ మొదలు పెట్టుకోబోతుందని చెబుతున్నారు.