Ram charan: ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజీపై గ్లోబల్ స్టార్.. చరణ్ అరుదైన రికార్డు
గ్లోబల్ స్థాయిలో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan).
ram charan on esquire magazine
- ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజీపై మేసిన రామ్ చరణ్
- ఎన్టీఆర్ తరువాత ఆ ఘనత రామ్ చరణ్ డే
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్
Ram charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీపై ఆయన మెరిశారు. దుబాయ్‌లో నిర్వహించిన ఈ ప్రత్యేక ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో ఎన్టీఆర్ ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించగా, ఆ ఘనత సాధించిన రెండో తెలుగు హీరోగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు.
Vishwak Sen: దేవర మేకర్స్ తో విశ్వక్ సేన్ కొత్త మూవీ షురూ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
చరణ్ స్టైలిష్ లుక్‌ను చూసి అభిమానులు మురిసిపోతూ, ఆయన పూర్తి ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, రామ్ చరణ్(Ram charan) ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఒక పాట మినహా సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇక ‘పెద్ది’ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌ను సాధించి రికార్డులు సృష్టిస్తున్నాయి. బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్, రామ్ చరణ్ మేకోవర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అటు ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజీ, ఇటు క్రేజీ మూవీ అప్డేట్స్తో మెగా అభిమానులకు ఈ ఏప్రిల్ నెల డబుల్ ట్రీట్‌గా మారింది.
