Ram Charan : మోదీతో కలిసి ఇండియా స్పీకర్ షిప్ సమ్మిట్ ప్రోగ్రాంలో మాట్లాడబోతున్న రామ్ చరణ్..
తాజాగా నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే దేశంలోనే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో దేశంలోని వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్.................

Ram Charan Participating and speak in #IndiaTodayConclave 2023 Program in Delhi along with PM Modi and amit shah and Sachin
Ram Charan : RRR సినిమా తర్వాత చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలకు దేశ విదేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక నార్త్ ప్రేక్షకుల్లో అయితే చరణ్, ఎన్టీఆర్ కి అభిమానులు కూడా పెరిగిపోయారు. ఇప్పుడు ఆస్కార్ వచ్చాక వాళ్ళ పేర్లు మరింత వినపడుతున్నాయి. ఆస్కార్ ముందే ఎన్టీఆర్, చరణ్ నార్త్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొని హంగామా చేశారు. ఇక ఆస్కార్ వచ్చాక నార్త్ రాజకీయ, సినీ ప్రముఖులు కూడా చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిని అభినందిస్తూ అక్కడ జరిగే పలు కార్యక్రమాలకు గెస్టులుగా పిలవడానికి రెడీ అయిపోయారు.
తాజాగా నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే దేశంలోనే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో దేశంలోని వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో మార్చ్ 17,18 లో జరగబోతోంది. ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్, అమిత్ షా, కేంద్ర మంత్రులు జయశంకర్, స్మృతి ఇరానీ, జాన్వీ కపూర్, శశిథరూర్.. మరింతమంది పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ పాల్గొంటున్నాడు. టాలీవుడ్ నుంచి చరణ్ ఒక్కరే కావడం విశేషం.
DVV Danayya : నాకు, RRR యూనిట్ కి సంబంధం లేదు.. నిర్మాత దానయ్య సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం అమెరికాలో ఉన్న చరణ్ నేడు లేదా రేపు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. రాగానే ఈ కార్యక్రమంలో పాల్గొంటాడని సమాచారం. India Today Conclave ప్రోగ్రాంలో మోదీ, అమిత్ షా లాంటి మహామహులతో పాటు వేదికపై కనపడనున్నాడని, మాట్లాడనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకి భారీగా టికెట్లు సేల్ అవుతున్నాయి. ఢిల్లీ లోని తాజ్ ప్యాలెస్ లో ఈ కార్యక్రమం జరగనుంది.
Meet @AlwaysRamCharan, at the #IndiaTodayConclave | March 17th & 18th, 2023, New Delhi.
Book your seat: https://t.co/vslWnN8Qv3#TheIndiaMoment #Promo pic.twitter.com/BC4Onrn9V0
— IndiaToday (@IndiaToday) March 12, 2023