Ram Charan: నేపాల్‌లో చరణ్ క్రేజ్.. ఏకంగా ఫ్రంట్ పేజీలో ఫోటో!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు టాలీవుడ్‌లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నటించే సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద క్యూ కడుతుంటారు....

Ram Charan Photo In Nepal News Paper Front Page Goes Viral
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు టాలీవుడ్‌లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నటించే సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ థియేటర్ల వద్ద క్యూ కడుతుంటారు. ఇక ఆయన వేసే డ్యాన్స్ స్టెప్పులకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. చరణ్ చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ ఆయన్ను ఇండస్ట్రీలో టాప్ హీరోల జాబితాల్లో నిలబెట్టాయి. ఇక చరణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన జోరును చూపిస్తున్నాడు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన చరణ్, తాజాగా ఆచార్య సినిమాలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో పోటీపడి నటించాడు.
Ram Charan: సిద్ధ పుట్టిందే చరణ్ కోసం – కొరటాల శివ
అయితే చరణ్ క్రేజ్ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆయన క్రేజ్ ఏరేంజ్‌లో వ్యాపించిందంటే.. ఏకంగా పొరుగు దేశంలోని ఓ న్యూస్ పేపర్‌లో ఫ్రంట్ పేజీలో ఆయన ఫోటో పడేలా. అవును.. ఇది నిజం. భారత్ పొరుగుదేశం అయిన నేపాల్‌లోని ఓ ప్రముఖ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో చరణ్ ఫోటోను చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. అయితే ఇంతకీ ఆయన ఫోటో నేపాల్ న్యూస్ పేపర్‌లో ఎందుకు వచ్చిందనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
Ram Charan : ‘ఆచార్య’లో నేను ఉన్నానని నాకే తెలీదు..
కానీ తమ అభిమాన హీరో ఫోటోను పక్కదేశంలోని న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో చూసి మెగాఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్‌ను పొగుడుతూ ఈ ఫోటో వచ్చి ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం నేపాల్‌లో చరణ్ ఫోటో మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే, చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.