RRR FUN : గిల్లుడు పంచాయితీ.. పెళ్లిళ్లు అయినా మారలేదని NTR, చరణ్‌లకు జక్కన్న క్లాస్!
RRR ప్రెస్ మీట్ హైదరాబాద్ చాలా సందడి వాతావరణంలో జరిగింది.

Rrr Press Meet Panchayathi
RRR Press Meet : RRR ప్రెస్ మీట్ హైదరాబాద్ లో చాలా సందడి వాతావరణంలో జరిగింది. మీడియా ప్రతినిధులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ బదులిచ్చారు. దాదాపు గంటా 45 నిమిషాల పాటు ప్రెస్ మీట్ కొనసాగింది. ముంబైలో ప్రోగ్రామ్ ఉండటంతో ఆలియా భట్ మొదట్లోనే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చి ప్రోగ్రామ్ మధ్యలోనే వెళ్లిపోయింది.
Also Read : RRR Press Meet : ఫ్యాన్స్ ఆ కౌంట్ మరిచిపోతారు-రాజమౌళి Live Updates
RRR ప్రెస్ మీట్ లో రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ మధ్య గిల్లుడు-కొట్టుడు పంచాయతీ నవ్వులు పూయించింది. ఓ సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ లేచి నిలబడి.. వీళ్లు ఇద్దరూ తను కొట్టాడు.. గిచ్చాడు అని కంప్లయింట్స్ ఇచ్చారని గుర్తుచేశాడు. “దాంతోపాటు.. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. వీళ్లిద్దరితో చాలా సమస్యలు ఎదుర్కొన్నా. సినిమాను 300 రోజులు తీస్తే… 25 డేస్ వీళ్లిద్దరి మూలంగా వేస్టయిపోయాయి” అని రాజమౌళి అనగానే… ఎన్టీఆర్ వెనకాల నుంచి గిల్లాడు. దీంతో.. లేచి నిలబడి మాట్లాడిన రాజమౌళి.. ఎగ్జాక్ట్‌లీ ఇదే రోజూ జరిగేదన్నారు. 30 ఏళ్లు పైన ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వెనకాల ప్రాణాలిచ్చేందుకు కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జక్కన్న… చరణ్ గిల్లుతున్నాడు అని ఎన్టీఆర్ కంప్లయింట్ చేస్తాడు. ఈయనేమో అమాయకంగా లేదే అంటూ ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు. స్క్రిప్ట్ చూసుకుంటున్నానే అని చరణ్ అంటాడు. గిల్లుడు గురించే 10.. 15 నిమిషాల పాటు ఇదే గొడవ.” అని రాజమౌళి వాళ్లిద్దరి గురించి మీడియాకు కంప్లయింట్ చేశాడు.
Moment of the day ? pic.twitter.com/1FROYeVjj0
— ?? Devdas ? ? (@DevDTweetz) December 11, 2021
దీనికి స్పందించిన ఎన్టీఆర్… ఆయన దాడి చేస్తుంటే.. పెదరాయుడిలాగా మీరేమైనా ధర్మం చెప్పారా.. తీర్పు చెప్పారా.. అని ప్రశ్నించాడు. వెంటనే రామ్ చరణ్ లేచి.. ఏంటి నేను దాడి చేశానా… అంటూ నిలదీశాడు. ఎంత గొప్ప యాక్టర్స్- క్రియేటర్స్ అయినప్పటికీ… చిన్న పిల్లల్లాంటి మనస్తత్వం, అల్లరితో తమ షూటింగ్ ఫ్రెండ్లీగా సాగిందని టీమ్ చెప్పకనే చెప్పింది.
— Msd ?? (@pspkmaniac7) December 11, 2021
Also Read : RRR Trailer: రామ్-భీమ్.. స్నేహితులా? శత్రువులా?
ప్రోగ్రామ్ అయిపోయాక ఇద్దరు స్టార్లు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా.. ఒకరి వెనకాల మరొకరు చేయి వేసుకున్నారు. ఈ సమయంలో… ఒక్కసారిగా ఝలక్ తగిలినట్టుగా ఎన్టీఆర్ స్పందించాడు. రామ్ చరణ్ గిచ్చాడనే ఎక్స్ ప్రెషన్ ఇస్తూ వెంటనే దూరం జరిగాడు. అదేంటి.. అలా పక్కకు జరిగావని రామ్ చరణ్ అనడంతో.. మళ్లీ నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సీన్ అందరినీ మరోసారి నవ్వుల్లో ముంచెత్తింది.