Ram Charan : కొండారెడ్డి బురుజు దగ్గర చరణ్.. ఫ్యాక్షన్ కాదు యాక్షన్..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'RC15'. గత కొన్నిరోజులుగా రాజమండ్రి పరిసరాల్లో ఈ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన పలు కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శంకర్. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ తరవాత షెడ్యూల్ కోసం కర్నూల్ చేరుకోనున్నట్లు తెలుస్తుంది.

Ram Charan ready to do action sequence at konda reddy buruju center
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RC15’. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. పిజ్జా, జిగర్తాండ, పేట వంటి సినిమాలను తెరకెక్కించిన తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి కథని అందిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో చరణ్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడు.
Ram Charan : పవన్ అన్‌స్టాపబుల్‌లో రామ్‌చరణ్‌కి కాల్ చేసిన బాలయ్య..
సామజిక అంశాలని కమర్షియల్ ఎలెమెంట్స్‌తో చెప్పడంలో శంకర్‌కి ఎవరు సాటిరారు. రోబో సినిమాతో ఈ ఫార్ములాని పక్కన పెట్టిన శంకర్.. మళ్ళీ ఇప్పుడు ఆ జోనర్‌లో సినిమా చేస్తుండడంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. గత కొన్నిరోజులుగా రాజమండ్రి పరిసరాల్లో.. ఈ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన పలు కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ తరవాత షెడ్యూల్ కోసం కర్నూల్ చేరుకోనున్నట్లు తెలుస్తుంది.
మహేష్ బాబు ఒక్కడు సినిమాతో కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలుసు. ఇప్పుడు అక్కడే దర్శకుడు శంకర్, చరణ్‌పై ఒక కీలకమైన సన్నివేశం తెరకెక్కించబోతున్నాడు. అయితే ఇది యాక్షన్ సీన్ అని తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మూవీ ఎక్కువ శాతం అవుట్ డోర్ షూటింగ్స్ జరుపుకోవడంతో, చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తులు తీసుకుంటున్న సినిమాకి సంబంధించిన ఫోటోలు బయటకి వస్తూనే ఉంటున్నాయి.