Rajamouli: బొమ్మరిల్లు ఫాదర్‌లా.. జక్కన్న బొమ్మరిల్లు డైరెక్టర్!

ఎస్‌ఎస్‌ రాజమౌళి అంటే సూపర్ సక్సెస్‌ రాజమౌళి అని పిలుచుకుంటారు ఆయన ఫ్యాన్స్. సినిమా తీస్తే అది సూపర్ డూపర్ హిట్టు కావాల్సిందే. ఇంత వరకు ఫెయిల్యూర్‌ అనేదే లేని వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్టై రెండు వేల కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతుంది.

Rajamouli

Rajamouli: ఎస్‌ఎస్‌ రాజమౌళి అంటే సూపర్ సక్సెస్‌ రాజమౌళి అని పిలుచుకుంటారు ఆయన ఫ్యాన్స్. సినిమా తీస్తే అది సూపర్ డూపర్ హిట్టు కావాల్సిందే. ఇంత వరకు ఫెయిల్యూర్‌ అనేదే లేని వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్టై రెండు వేల కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతుంది. ఇందులో నటించిన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు పాన్ ఇండియా క్రేజ్ సొంతం కాగా రాజమౌళికి ఇండియన్ సినీ మేకర్స్ అంతా దాసోహమంటున్నారు. జక్కన్న ఇంతటి సక్సెస్ కు కారణం ఆయన సినిమా కోసం పెట్టే డెడికేషన్ అని అందరికీ తెలిసిందే.

Rajamouli: ఇప్పటివరకు రాజమౌళి ఒక్కడే!

కాగా.. రాజమౌళితో సినిమా అంటే హీరోలను లాక్ చేసి చూపు పక్కకి తిప్పకుండా ఫోకస్ మొత్తం సినిమా మీదే పెట్టేస్తారని తెలిసిందే. తాను అనుకున్నట్లు సీన్ వస్తేనే నటీనటులను వదిలిపెడతారు.. తన సినిమా అయిపోతేనే హీరోలను మరో సినిమాకు డేట్స్ ఇచ్చేలా ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పటి వరకు రాజమౌళితో పని చేసిన హీరోలందరూ ఇలా లాక్ అయిన వారే కాగా.. అందుకు భిన్నంగా రామ్ చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ జరుగుతుండగానే ఆచార్య సినిమాను కూడా పూర్తి చేశాడు.

Rajamouli: ‘అడవిరాముడు’గా మహేష్.. జక్కన్న ప్లాన్ ఇదేనా?

రాజమౌళి చరణ్ ను ఆచార్య కోసం కాస్త సడలింపు ఇవ్వడం వెనక చాలా కథే నడిచింది. ఆచార్య ప్రమోషన్లలో దాని గురించి చెప్పిన రామ్ చరణ్ మరో విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. అదేంటంటే బొమ్మరిల్లు ఫాదర్ లాగా జక్కన్న డైరెక్టర్ అంట. అంటే బొమ్మరిల్లు సినిమాలో కొడుకు సిద్దూను తన చేతిలోనే ఉంచుకున్న తండి మాదిరి.. రాజమౌళి తన సినిమా హీరోను కూడా సినిమా అయ్యే వరకు తన చేతిలోనే ఉంచుకుంటారట. అయితే.. ఆచార్య కోసం చరణ్ చేతిని అప్పుడప్పుడు వదులుతూ ఫ్రీడమ్ ఇచ్చాడట. అందుకే ఆచార్య చేయగలిగామని చెప్పుకొచ్చాడు.