Rajamouli: ‘అడవిరాముడు’గా మహేష్.. జక్కన్న ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆయన తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు.....

Rajamouli: ‘అడవిరాముడు’గా మహేష్.. జక్కన్న ప్లాన్ ఇదేనా?

Rajamouli Mahesh Babu Movie To Be Based On Adaviramudu

Rajamouli: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆయన తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఆయన స్టామినా ఏమిటో చూపించాయి. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జక్కన్న, తన నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Mahesh-Rajamouli: టాలీవుడ్ హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా జక్కన్న-మహేష్ ప్రాజెక్ట్?

ఇప్పటికే ఈ సినిమా అడవి నేపథ్యంలో రాబోతుందని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. దీంతో మహేష్ బాబుతో జక్కన్న ఎలాంటి సినిమాను పట్టుకొస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ షూటింగ్ ఆఫ్రికా దేశంలోని అడవుల్లో చిత్రీకరించనున్నట్లు జక్కన్న తెలిపారు. కాగా ఈ సినిమాలో రాజమౌళి గురువు కె.రాఘవేంద్ర రావు ఇంపాక్ట్ గట్టిగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్‌తో రాజమౌళి అడవి నేపథ్యంలో సినిమా తీస్తుండటంతో ఈ సినిమాలో జంతువులను కూడా వాడాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో జంతువులను సినిమాల్లో వాడటం నిషేధించడంతో ఈ సినిమా షూటింగ్‌ను ఆఫ్రికాలో ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. ఇక సెట్స్ లేకుండా అడవిలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుండటంతో.. గతంలో రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘అడవిరాముడు’ తరహా సినిమాగా ఇది రానుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Rajamouli: మహేష్ కోసం అడవి బాట పడుతున్న జక్కన్న..?

40 ఏళ్ల క్రితమే వచ్చిన అడవిరాముడు చిత్రం కూడా ఎలాంటి సెట్స్ వాడకుండా.. అడవిలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఆ సినిమాలో ఏనుగులను ఉపయోగించారు చిత్ర యూనిట్. అంటే.. ఈ లెక్కన రాజమౌళి-మహేష్ కాంబోలో రాబోయే సినిమా కూడా ఇంచుమించు అడవిరాముడు తరహాలోనే ఉంటుందా.. లేక అడవిరాముడు సినిమా నుండి ఇన్‌స్పైర్ అయ్యి ఈ సినిమాను తీస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా జంగిల్ నేపథ్యంలో రాబోయే సినిమా కావడంతో మహేష్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను కె.యల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.