Rajamouli: ఇప్పటివరకు రాజమౌళి ఒక్కడే!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి గురించి ప్రత్యేక ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఆయన తెరకెక్కించిన సినిమాలే ఆయన గురించి చెబుతాయి. కెరీర్‌లో ఒక్క పరాజయం....

Rajamouli: ఇప్పటివరకు రాజమౌళి ఒక్కడే!

Rajamouli Is The Only Director With Back To Back 1000 Cr Movies

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి గురించి ప్రత్యేక ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఆయన తెరకెక్కించిన సినిమాలే ఆయన గురించి చెబుతాయి. కెరీర్‌లో ఒక్క పరాజయం కూడా లేకుండా ఇప్పటివరకు కేవలం సక్సెస్ చిత్రాలతోనే దూసుకుపోతున్న ఈ డైరెక్టర్, ఇప్పుడు దేశవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా బాక్సాఫీస్‌ను ఓ చెడుగుడు ఆడుకున్న సంగతి తెలిసిందే.

Rajamouli : అర్ధరాత్రి పూట చార్మినార్ రోడ్ల మీద రాజమౌళి

ఇక బాహుబలి-2 గురించి మన రాష్ట్రం, మన దేశం మాత్రమే కాకుండా.. యావత్ ప్రపంచం మాట్లాడుకునేలా చేశాడు ఈ స్టార్ డైరెక్టర్. విజువల్ వండర్ సినిమాగా.. పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే బజ్‌ను క్రియేట్ చేసి మరీ రిలీజ్ చేశాడు జక్కన్న. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.1800 కోట్ల కలెక్షన్లతో రాజమౌళి స్తామినా ఏమిటో బాక్సాఫీస్‌కు చూపించింది బాహుబలి-2 మూవీ. అయితే ఈ సినిమాతోనే ఆయన విజయపరంపర ఆగిపోలేదు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1084 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Rajamouli: ‘అడవిరాముడు’గా మహేష్.. జక్కన్న ప్లాన్ ఇదేనా?

ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన డైరెక్టర్‌గా దేశవ్యాప్తంగా కేవలం రాజమౌళి మాత్రమే ఉన్నాడని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ ఇలా వెయ్యి కోట్లు సాధించిన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా రాజమౌళి తనపేరున అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ రికార్డును తన నెక్ట్స్ మూవీతో కంటిన్యూ చేయాలని ఆయన చూస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి రాజమౌళి చేయబోయే సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రానుండటంతో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమాతో వెయ్యి కోట్ల వసూళ్లలో జక్కన్న హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంటాడా లేడా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.