Ram Charan : నా భార్య ముందే నన్ను తిట్టారు.. దానికి ఉపాసన ఫీల్ అయ్యింది.. రామ్‌చరణ్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' తో గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చరణ్.. RRR ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికా టూర్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంగ్లీష్ మీడియాకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు రామ్ చరణ్. ఈ ఇంటర్వ్యూలో పలు ఆశక్తికర విషయాలు తెలియజేశాడు.

Ram Charan : నా భార్య ముందే నన్ను తిట్టారు.. దానికి ఉపాసన ఫీల్ అయ్యింది.. రామ్‌చరణ్!

Ram Charan

Updated On : January 14, 2023 / 9:04 AM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించుకున్నాడు. చరణ్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ప్రెజన్స్ కి హాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ మీడియాలు సైతం జేమ్స్ బాండ్ సిరీస్ లో నెక్స్ట్ హీరోగా రామ్ చరణ్ నటించ వచ్చు అంటూ కథనాలు రాసుకొస్తున్నాయి. ప్రస్తుతం చరణ్.. RRR ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికా టూర్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంగ్లీష్ మీడియాకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు రామ్ చరణ్. ఈ ఇంటర్వ్యూలో పలు ఆశక్తికర విషయాలు తెలియజేశాడు.

Ram Charan : నా చేతిలో మొత్తం ఆరు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.. రామ్‌చరణ్!

దాదాపు నాలుగు దశాబ్దాలు పాటు మా నాన్నగారు సినిమా రంగంలోనే ఉంటూ వస్తున్నారు. దీంతో సినిమా విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. శరీరాకృతిలో కొంచెం చేంజ్ వచ్చిన ఆయన ఊరుకోరు. ఇలా ఒక సమయంలో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఫ్యామిలీ మొత్తం భోజనం చేస్తున్న సమయంలో బరువు తగ్గవు ఏంటిరా? అని అడిగారు. నేను అది నిజమనుకొని అవునా అప్పా అంటూ తల ఊపాను. అంతే వెంటనే.. ఇడియట్ నేను సరదాగా అన్నాను. అసలు నిన్ను చూసుకుంటున్నావా, ఎలా బరువు పెరిగిపోతున్నావు చూడు. ముందు జిమ్ కి వెల్లు అంటూ కోపడ్డారు.

ఆ సమయంలో నా భార్య ఉపాసన కూడా అక్కడే ఉంది. అదంతా చూసి.. ‘నిన్ను ఏంటి అలా అవమానిస్తున్నారు’ అంటూ ఫీల్ అయ్యింది. ‘అది అవమానించడం కాదు, నటులు మధ్య సంభాషణలు అలానే ఉంటాయి’ అంటూ ఆమెకు చెప్పుకొచ్చేవాడిని అని తెలియజేశాడు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో RC15 తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా వస్తుంది. తమిళ మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రనికి కథని అందిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.