Ram Charan : నా చేతిలో మొత్తం ఆరు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.. రామ్‌చరణ్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాల లైన్ అప్ గురించి తెలియజేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ హీరోతో.. స్టార్ డైరెక్టర్లు అంతా సినిమాలు తీయడానికి ఆశక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ అమెరికా టూర్ లో ఉన్నాడు. ఆస్కార్ స్క్రీనింగ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నేపథ్యంలో అక్కడ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న రామ్ చరణ్.. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ లు గురించి తెలియజేశాడు.

Ram Charan : నా చేతిలో మొత్తం ఆరు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.. రామ్‌చరణ్!

Ram Charan gave update on his upcoming projects

Updated On : January 13, 2023 / 10:38 AM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాల లైన్ అప్ గురించి తెలియజేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ హీరోతో.. స్టార్ డైరెక్టర్లు అంతా సినిమాలు తీయడానికి ఆశక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ అమెరికా టూర్ లో ఉన్నాడు. ఆస్కార్ స్క్రీనింగ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నేపథ్యంలో అక్కడ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న రామ్ చరణ్.. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ లు గురించి తెలియజేశాడు.

Ram Charan : కొండారెడ్డి బురుజు దగ్గర చరణ్.. ఫ్యాక్షన్ కాదు యాక్షన్..

‘2023లో నేను మూడు సినిమాలు ఒప్పుకున్నాను. వచ్చే ఏడాది మరో మూడు సినిమాలకు సైన్ చేశాను. దీంతో మొత్తం నా చేతిలో ఆరు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి’ అంటూ వెల్లడించాడు మెగాపవర్ స్టార్. ప్రెజెంట్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఒక సినిమా ఒప్పుకోగా, ఇందుకు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. దీని తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీకి సైన్ చేశాడు.

ఇక నెక్స్ట్ ఇయర్ సైన్ చేసిన సినిమాలు గురించి మాట్లాడుకుంటే.. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కన్నడ దర్శకుడు నర్తన్ ఇటీవలే చరణ్ కి ఒక కథ వినిపించగా, రామ్ చరణ్ కూడా ఓకే చెప్పాడు అని వార్తలు వినిపించాయి. ఇక మరో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూడు ప్రాజెక్ట్ లు గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న RC15 చిత్రం షూటింగ్ దాదాపు 50 శాతం కంప్లీట్ అయ్యినట్లు తెలియజేశాడు నిర్మాత దిల్ రాజ్. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

 

View this post on Instagram

 

A post shared by ?????????.??? (@ramcharan.rc1800)