Ram Charan : IMDbలో అత్యధిక రేటింగ్స్ సాధించిన రామ్‌చరణ్ సినిమాలు ఇవే..
తన ఫాలోయింగ్ తో మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనిపించుకునే రామ్ చరణ్ (Ram Charan).. తన మూవీ రేటింగ్స్ తో కూడా టాప్ పొజిషన్ లో ఉంటాడు. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ రేటింగ్ వెబ్ సైట్ IMDbలో..

Ram Charan Top IMDb Rating Movies List
Ram Charan : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా రామ్ చరణ్ (Ram Charan) వెండితెరకు పరిచయం అవుతున్న సమయంలో చాలామంది మదిలో ఒక ప్రశ్న పుట్టుకొచ్చింది. అదేంటంటే చిరంజీవి అందుకున్న స్థాయిని చరణ్ అందుకోగలడా? అని. కానీ రామ్ చరణ్ నేడు చిరంజీవి స్థాయిని ధాటి ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకొని, ఇండియన్ హీరోలు అందుకొని ఎన్నో ఘనతలు అందుకొని ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ గా నిలిచాడు. ఇక ఈరోజు (మార్చి 27) రామ్ చరణ్ బర్త్ డే అవ్వడంతో వరల్డ్ వైడ్ గా చరణ్ కి విషెస్ తెలియజేస్తున్నారు అభిమానులు.
Ram Charan : రామ్‌చరణ్‌కు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పిన అమిత్ షా.. పవన్ కళ్యాణ్ లేఖ!
2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ సినిమాతో అదిరిపోయే డెబ్యూట్ ఇచ్చిన రామ్ చరణ్.. రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ హిట్టుని అందుకున్నాడు. తన ప్లాప్ సినిమాలతో కూడా 50 కోట్లకు తగ్గకుండా కలెక్షన్స్ సాధించి మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనిపించుకున్నా.. నటన విషయంలో విమర్శలు ఎదురుకుంటూనే వచ్చాడు. అయితే ధృవ, రంగస్థలం లాంటి సినిమాలతో ఆ విమర్శలకు బదులిచ్చాడు. ఇక RRR చిత్రంతో విమర్శించిన వారి చేతే ప్రశంసించేలా చేసుకున్నాడు. అంతేకాదు త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు.
ఇక తన ఫాలోయింగ్ తో మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనిపించుకునే రామ్ చరణ్ కొన్ని వెబ్ సైట్ మూవీ రేటింగ్స్ లో కూడా టాప్ పొజిషన్ లో నిలుస్తుంటాడు. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ రేటింగ్ వెబ్ సైట్ IMDbలో రామ్ చరణ్ నటించిన పలు సినిమాలు అత్యధిక రేటింగ్స్ సాధించి టాప్ లో ఉన్నాయి. అలా అత్యధిక రేటింగ్ తో ఉన్న 8 సినిమాలు ఇవే.
రంగస్థలం 1985 – 8.2
ఆర్ఆర్ఆర్ (RRR) – 7.9
మగధీర – 7.7
ధృవ – 7.7
ఆరెంజ్ – 6.6
ఎవడు – 5.8
గోవిందుడు అందరి వాడేలే – 5.7
నాయక్ – 5.6