Ram Charan: శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’కు మెగా పవర్ స్టార్ విషెస్

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శ్రీ కార్తిక్ తెరకెక్కిస్తుండగా టైమ్ ట్రావెల్ మూవీగా ఈ సినిమా రానుంది. కాగా తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఒకే ఒక జీవితం’ చిత్ర యూనిట్‌కు తనదైన స్టయిల్‌లో విషెస్ తెలిపారు.

Ram Charan: శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’కు మెగా పవర్ స్టార్ విషెస్

Ram Charan Wishes Best For Sharwanand Oke Oka Jeevitham

Updated On : September 3, 2022 / 10:00 PM IST

Ram Charan: యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శ్రీ కార్తిక్ తెరకెక్కిస్తుండగా టైమ్ ట్రావెల్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా శర్వానంద్ కెరీర్‌లో 30వ సినిమాగా వస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Oke Oka Jeevitham: ఒకే ఒక జీవితం ట్రైలర్.. సైఫై డ్రామాలో శర్వా అదరగొట్టాడు!

కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తోంది. ‘ఒకే ఒక జీవితం’ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఒకే ఒక జీవితం’ చిత్ర యూనిట్‌కు తనదైన స్టయిల్‌లో విషెస్ తెలిపారు. శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం ట్రైలర్ మనసుల్ని హత్తుకునేలా ఉందని.. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని చరణ్ కోరారు.

Oke Oka Jeevitham: ఒకే ఒక జీవితం.. వచ్చేది అప్పుడే!

అయితే శర్వానంద్, చరణ్ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే చరణ్ శర్వాకు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. ఇక ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, అమలా అక్కినేని తల్లి పాత్రలో నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించగా, డ్రీమ్ వారియర్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. సెప్టెంబర్ 9న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.